Asianet News TeluguAsianet News Telugu

లాక్ డౌన్ పొడిగింపు.. హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులు..!

నిన్నటి వరకు ఉదయం 6 నుంచి 10 గంటల వరకు కావాల్సిన వస్తువులు తీసుకువచ్చుకునే అవకాశం ఇవ్వగా.. ఇప్పుడు.. దానిని మధ్యాహ్నం ఒంటి గంట వరకు మార్చారు. ఈ నేపథ్యంలోనే మెట్రోవేళల్లోనూ మార్పులు చోటుచేసుకోనున్నాయి.
 

Metro timings Changed in Telangana
Author
Hyderabad, First Published May 31, 2021, 8:42 AM IST

తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ ని మరో పది రోజులపాటు పొడిగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. మెట్రోవేళ్లల్లోనూ మార్పులు చోటుచేసుకోనున్నాయి. కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటంతో  రాష్ట్రంలో లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే.. కొన్ని గంటలు మాత్రం సడలింపు ఇచ్చారు. నిన్నటి వరకు ఉదయం 6 నుంచి 10 గంటల వరకు కావాల్సిన వస్తువులు తీసుకువచ్చుకునే అవకాశం ఇవ్వగా.. ఇప్పుడు.. దానిని మధ్యాహ్నం ఒంటి గంట వరకు మార్చారు. ఈ నేపథ్యంలోనే మెట్రోవేళల్లోనూ మార్పులు చోటుచేసుకోనున్నాయి.

తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్‌ను పొడిగించిన నేపథ్యంలో మెట్రో రైళ్ల వేళలను పొడిగించి నడుపుతామని మెట్రో అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఉదయం 7 గంటల నుంచి ఉదయం 9.45 వరకు నడుస్తున్న రైళ్లు నడుస్తున్నాయని, లాక్‌డౌన్‌ సడలింపు సమయం పెంచిన నేపథ్యంలో సోమవారం నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు నడిపిస్తామని వెల్లడించారు.

 ఒంటి గంట నుంచి 2 గంటల మధ్య సైతం ప్రజలు తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు సమయం ఇవ్వడంతో ఆ టైంలోనూ రైళ్లను నడిపేందుకు కార్యాచరణను సిద్ధం చేస్తామన్నారు
 

Follow Us:
Download App:
  • android
  • ios