స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మూడు రోజుల పాటు అపరిమిత రైడ్ ను ఆస్వాదించేందుకు హైదరాబాద్ మెట్రో రైల్ అవకాశం కల్పించింది. కేవలం రూ.59 చెల్లించి హైదరాబాద్ లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చు.
ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో అదిరిపోయే శుభవార్త చెప్పింది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని బంఫర్ ఆఫర్ ప్రకటించింది. రూ.59 చెల్లించి మూడు రోజుల పాటు ఫ్రీ రైడ్ ను ఆస్వాదించే అవకాశాన్ని కల్పించింది. దీని కోసం ‘సూపర్ సేవర్ ఫ్రీడమ్ ఆఫర్’ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
కాంగ్రెస్ వ్యూహాత్మక అడుగులు.. తెలంగాణలో ప్రియాంక గాంధీ, డీకే శివ కుమార్ లకు ముఖ్య బాధ్యతలు..
ఇప్పటికే ప్రయాణికుల వద్ద ఉన్న మెట్రో కార్డుకు రూ.59 అదనంగా చెల్లించి ఈ ఆఫర్ ను వాడుకోవచ్చు. సూపర్ సేవర్ ఫ్రీడమ్ ఆఫర్ రీచార్జ్ చేసుకుంటే ఈ సదుపాయం వర్తిస్తుంది. ఈ రీచార్జ్ చేసుకున్న ప్రయాణికులందరూ ఆగస్టు 12, 13, 15వ తేదీల్లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా, అపరిమితంగా మెట్రో ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు.
‘నాకు ముస్లింల ఓట్లు అవసరం లేదు.. కానీ’ - అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ
ఇండిపెండెన్స్ డే సందర్భంగా హైదరాబాద్ లోని ప్రయాణికుల సౌకర్యార్థం ఈ ఆఫర్ ను తీసుకొచ్చామని మెట్రో అధికారులు స్పష్టం చేశారు. ఈ అవకాశాన్ని మెట్రో ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. హాలిడే కార్డ్ రీచార్జ్ చేసుకొని మెట్రో ప్రయాణాన్ని ఆస్వాదించాలని సూచించారు.
