Asianet News TeluguAsianet News Telugu

రెండు మూడు రోజుల్లో పాతబస్తీ మెట్రో పనులు ప్రారంభం : ఎన్వీఎస్ రెడ్డి

మెట్రో పనులు అన్ని చోట్లా వేగవంతంగా జరరుగుతున్నా పాతబస్తీలో మాత్రం ఇప్పటివరకు ప్రారంభం కాలేవు. దీంతో ఈ మార్గంలో అసలు మెట్రో పరుగులు ఉంటాయా అని నగర వాసుల్లో అనుమానం కూడా మొదలైంది. అయితే ఈ అనుమానాలను పటాపంచలు చేస్తూ త్వరలోనే పాతబస్తీ ప్రాంతంలో మెట్రో పనులు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

Merto Rail works from MGBS To Falaknuma stretch To begin in short while
Author
Hyderabad, First Published Aug 25, 2018, 5:19 PM IST

హైదరాబాద్ నగర ప్రజల రవాణా కష్టాలను తీర్చడానికి తెలంగాణ ప్రభుత్వం పిపిపి(పబ్లిక్ ప్రైవేట్ బాగస్వామ్యం) పద్దతిలో చేపడుతున్న అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టు మెట్రో. ఇప్పటికే మియాపూర్ నుండి నాగోల్ వరకు మెట్రో రైలు పరుగెడుతోంది. అలాగే అమీర్ పేట్ నుండి ఎల్బీనగర్ వరకు మెట్రో ట్రయల్ రన్స్ జరుగుతున్నాయి. ఇక హైటెక్ సిటి మార్గంతో పాటు జెబియస్ నుండి ఎంజిబిఎస్ వరకు ఈ మెట్రో పనులు ఆటంకం లేకుండా జరుగుతున్నాయి. 

అయితే ఈ మెట్రో పనులు అన్ని చోట్లా వేగవంతంగా జరరుగుతున్నా పాతబస్తీలో మాత్రం ఇప్పటివరకు ప్రారంభం కాలేవు. దీంతో ఈ మార్గంలో అసలు మెట్రో పరుగులు ఉంటాయా అని నగర వాసుల్లో అనుమానం కూడా మొదలైంది. అయితే ఈ అనుమానాలను పటాపంచలు చేస్తూ త్వరలోనే పాతబస్తీ ప్రాంతంలో మెట్రో పనులు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

ఎంజిబిఎస్ నుండి ఫలక్ నుమా వరకు చేపట్టనున్న పెట్రో పనులు రెండు మూడు రోజుల్లో ప్రారంభమవుతాయని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఇవాళ ఆయన ఎంఐఎం ప్లోర్ లీడర్ అక్బరుద్దిన్ ఓవైసి, ముంతాజ్ అహ్మద్ ఖాన్, సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రి, అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలాతో కలిసి పాతబస్తీలో చేపట్టనున్న మెట్రో మార్గాన్ని పరిశీలించారు.  

Follow Us:
Download App:
  • android
  • ios