Asianet News TeluguAsianet News Telugu

మతి చలించి.. రోడ్డుపై టెక్కీ హల్ చల్

జనాలపై రాళ్ల తో దాడి చేసే ప్రయత్నించగా, భయాందోళనకు గురైన వాహనదారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులపై కూడా అతడు దాడికి దిగాడు. కొద్దిసేపు పోలీసులను ముప్పతిప్పలు పెట్టాడు. దీంతో పోలీసులు ఆ వ్యక్తిని తాడుతో కట్టేసి ఆటోలో పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు.

Mentally Unsound Techie Halchal at Banjara Hills
Author
Hyderabad, First Published Nov 22, 2019, 2:16 PM IST

మతిస్థిమితం కోల్పోయి ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ రోడ్లు పై హల్ చల్ చేశాడు. రోడ్డుపై వెళ్తున్న వాహనదారులపై రాళ్లు విసురుతూ భయబ్రాంతులకు గురి చేశాడు. కాగా... పోలీసులు వచ్చి అతనిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.... బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 3లో నాగార్జున సర్కిల్‌ వద్ద మతిస్థిమితం లేని వ్యక్తి రోడ్డుపై వెళ్తున్న వాహనదారులను ఇబ్బందులకు గురిచేసాడు. జనాలపై రాళ్ల తో దాడి చేసే ప్రయత్నించగా, భయాందోళనకు గురైన వాహనదారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులపై కూడా అతడు దాడికి దిగాడు. కొద్దిసేపు పోలీసులను ముప్పతిప్పలు పెట్టాడు. దీంతో పోలీసులు ఆ వ్యక్తిని తాడుతో కట్టేసి ఆటోలో పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు.

దాదాపు గంట సేపు రోడ్డుపై హంగామా చేయడంతో కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడి వాహనాలు నిలిచిపోయాయి. మెహదిపట్నం, హైటెక్‌ సిటీకి వెళ్లే దారిలో ట్రాఫిక్‌ జామ్‌ అయింది. రోడ్డుపై వీరంగం​ సృష్టించిన వ్యక్తిని రక్ష రాజు గా పోలీసులు గుర్తించారు. అతడు డెలాయిట్‌ కంపెనీలో పనిచేస్తున్నాడని కనుగొన్నారు. మతిస్థిమితం కోల్పోయి మూడు రోజులుగా రోడ్లపై తిరుగుతున్నట్టు గుర్తించారు. తిరుమలగిరి ప్రాంతంలో ఉంటున్న అతడి కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు.

Follow Us:
Download App:
  • android
  • ios