ఆమెకు నా అనేవారు ఎవరూ లేరు. తల్లిదండ్రులు చనిపోయారు. తోడబుట్టిన అన్న.. తన దారి తాను చూసుకున్నాడు. ఎవరూ లేక ఒంటరిగా మిగిలిపోయి.. చివరకు మతిస్థిమితం కూడా కోల్పోయింది. బిచ్చమెత్తుకుంటూ రోడ్డుమీద గడిపేది. అలాంటి మహిళపై కామాంధుల కన్నుపడింది.

ఆ మహిళ.. ముగ్గురు బిడ్డలకు జన్మనివ్వడం గమనార్హం.  కొందరు మృగాళ్లు లైంగిక దాడి చేయడంతో ఆమె మూడుసార్లు గర్భం దాల్చి.. బిడ్డలకు జన్మనిచ్చింది. అయితే.. నిందితులు ఎవరు అన్న విషయం మాత్రం బయటకు రాలేదు. అధికారులు కనీసం పట్టించుకోకపోవడం గమనార్హం.

ఈ సంఘటన నారాయణపేట జిల్లా కోస్గి పట్టణంలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కోస్గి పట్టణానికి చెందిన మహిళ ఆదివారం మూడో బిడ్డకు జన్మనిచ్చింది. బస్టాండ్ దగ్గర పెట్రోల్ బంక్ వెనక నిర్మాణంలో ఉన్న భవనంలో మహిళ నొప్పులతో బాధపడుతుండగా.. స్థానికులు గుర్తించి ఆస్పత్రికి తరలించారు. ఆమెకు ఆడబిడ్డ పుట్టింది.

డెలివరీ తర్వాత సదరు మహిళ బిడ్డను అక్కడే వదిలేసి వెళ్లిపోయింది. పసిబిడ్డనుు శిశుగౄహకు తరలించారు. గతంలో ఇద్దరు బిడ్డలు పుట్టినప్పుడు కూడా ఇలానే వదిలేసి వెళ్లిపోయిందని స్థానికులు  చెబుతున్నారు.