కేసిఆర్ పై మాజీ స్పీకర్ మీరాకుమార్ ఫైర్

meira kumar fire on kcr
Highlights

సంపత్ ను ఎందుకు సస్పెండ్ చేశారు ?

దళితుల పై దాడులు పెరిగిపోతున్నాయి. కాబట్టి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చటం మరింత బలపర్చాలి. దేశంలో ఎస్సీ, ఎస్టీలు బానిసల కంటే దారుణంగా చూడబడుతున్నారు. చటం బలపర్చడం లో బీజేపీ ప్రభుత్వం విఫలం అయింది. తెలంగాణ లో దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాం అని చెప్పి మాట తప్పారు. డిప్యూటీ సీఎం రాజయ్యను అవమానకరంగా తప్పించారు ఎందుకో చెప్పాలి. అసెంబ్లీ లో దళిత ఎమ్మెల్యే సంపత్ ని ఎందుకు సస్పెండ్ చేశారు? కనీసం కారణం కూడా చెప్పలేదు. ఈ చర్య రాజ్యంగాన్న ఖూనీ చేయడమే. ఇష్టానుసారంగా ప్రభుత్వ లు నడుచుకోవడం బాధాకరం. తెలంగాణ లో జరుగుతున సంఘటనలు, కేసిఆర్ ప్రభుత్వ విధానాలు నన్ను చాలా డిస్సపాయింట్ చేస్తున్నాయి. తెలంగాణ లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అణిచి వేసే ప్రయత్నం జరుగుతున్నది. ఇది చాలా బాధాకరం. తెలంగాణ తో నాకున్న సాన్నిహిత్యాని ఎలక్షన్, పాలిటిక్స్ తో ముడిపెట్టలేము.

 

loader