కొందరు బాధ్యతలేని సీఎంలు.. కానీ ఆయన నిజమైన నాయకుడు: కేసీఆర్‌పై నాగబాబు ప్రశంసలు
ఆ వెంటనే మీడియా ముందుకు వచ్చి ప్రజలకు వాటి వివరాలను అందిస్తూ, ధైర్యాన్ని కల్పిస్తున్నారు. లాక్‌డౌన్ సందర్భంగా ప్రజలకు కావాల్సిన అవసరాలు తీరుస్తూ.. పేదలు, కూలీలకు ఆర్ధిక సాయం సైతం అందిస్తున్నారు.
ప్రజల ఆరోగ్యం దృష్ట్యా లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలు పొడిగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని అందరికంటే ముందే కోరారు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌పై అన్ని వర్గాలు, ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి సినీనటుడు, జనసేన నేత నాగబాబు చేరారు.
ఈ మధ్య కేసీఆర్ మీటింగ్ లో ఆయన మాటలు వింటుంటే ఆయన మీద అభిమానం పెరిగింది. దేశం రాష్ట్రం అల్లకల్లోలంగా వున్నప్పుడు ప్రజలకి నేనున్నాను అని ధైర్యం చెప్పి సమస్యలని పరిష్కరించే వాడే నిజమైన నాయకుడు. ఏ మాత్రం బాధ్యత లేని కొందరు సీఎం లు ఉన్న దేశంలో కేసీఆర్ గారిలాంటి లీడర్స్ వజ్రాల్లా మెరుస్తారు" అని ట్వీట్ చేసి ప్రశంసల వర్షం కురిపించారు.
కాగా రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణ, లాక్‌డౌన్ పరిస్ధితులపై ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ భేటీకి మంత్రి ఈటల రాజేందర్, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు హాజరయ్యారు. ఈ నెల 20వ తేదీ తర్వాత ఇవ్వాల్సిన మినహాయింపులపై అధికారులతో సీఎం చర్చిస్తున్నారు.