Asianet News TeluguAsianet News Telugu

ఒక్క ఫోన్ కాల్ చేస్తే... ఇంటికి వచ్చి కరోనా చికిత్స: మంత్రి శ్రీనివాస్ గౌడ్

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటింటి సర్వే లో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఏనుగొండ లో  "ఇంటింటి ఆరోగ్యం" కార్యక్రమాన్ని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు.
 

medical services at home with a single phone call minister srinivas goud
Author
Hyderabad, First Published Jan 21, 2022, 5:02 PM IST

ఒక్క ఫోన్ కాల్ తో ఇంటికి వచ్చి కరోన వైద్యానికి చికిత్స అందిస్తామని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. రాష్ట్ర‌ప్ర‌భుత్వ నిర్వ‌హిస్తోన్న ఇంటింటి సర్వే లో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఏనుగొండ లో  "ఇంటింటి ఆరోగ్యం" కార్యక్రమాన్ని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు.

కరోనా ను ఎదుర్కోవడంలో భాగంగా “ ఇంటింటా ఆరోగ్యం” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ప్రజలు కరోనా పట్ల భయపడాల్సిన అవసరం లేదన్నారు. డాక్టర్లు సూచించిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. "ఇంటింటా ఆరోగ్యం" కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఏనుగొండలో ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడి జ్వరాలు , దగ్గు ఇతర ఏమైనా అనారోగ్య సమస్యలున్నాయో అడిగి తెలుసుకున్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్ . 

అనంతరం.. ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ..  ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఈ కార్య‌క్రమాన్ని ప్రారంభించామ‌ని తెలిపారు. కరోనకు అన్ని రకాల వైద్యం అందించడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం “ ఇంటింట ఆరోగ్యం ” పేరుతో సర్వే నిర్వహించి జ్వరం, దగ్గు, ఇతర కరోనా లక్షణాలతో బాధపడుతున్న వారికి వైద్యం అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.

ఇందులో భాగంగానే అన్ని జిల్లా కేంద్రాల్లో ఆక్సిజన్  పడకలతో సహా అవసరమైన మందులు, ఇతర ఏర్పాట్లు చేశామని, ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు.

మహబూబ్ నగర్ జిల్లాలో “ ఇంటింటా ఆరోగ్యం ” కార్యక్రమంలో భాగంగా 1,89,319 ఇళ్లకు వెళ్లి వైద్య ఆరోగ్య సిబ్బంది, ఆశా , అంగన్ వాడి కార్యకర్తలు ప్రజల ఆరోగ్యం గురించి సర్వే నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో 40 వేల కోవిడ్ ఐసోలేషన్ కిట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. అవసరమైతే మరో 1లక్ష కిట్లు ఇస్తామన్నారు. ఎవరు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఎవరికైనా అనుమానం వస్తే ఇంటి దగ్గరే కిట్ల లోని టాబ్లెట్ వేసుకోవడం తో పాటు, చికిత్స తీసుకోవాలని అన్నారు.

కరోనా విషయంలో రాష్ట్ర సీఎం కేసీఆర్, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు ల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ బాధ్యతగా తీసుకొని పని చేయాలని కోరారు.

కరోనా వచ్చిన వెంటనే టాబ్లెట్ వేసుకోవాలని, భయపడకుండా  జాగ్రత్తలు తీసుకోవాలని, ఎవరికైనా చికిత్స  అవసరమైతే కలెక్టర్ కార్యాలయంలో 08542 - 241165 ఫోన్ తో కంట్రోల్ రూమ్ కూడా  ఏర్పాటు చేయడం జరిగిందని, పైన పేర్కొన్న ఫోన్ చేస్తే ఫోన్ చేస్తే వైద్య సిబ్బంది ఇంటికి వచ్చి చికిత్స అందించే ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.

అనంత‌రం.. జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు మాట్లాడుతూ జిల్లాలో ఇంటింటా ఆరోగ్యం కార్యక్రమానికి సర్వే నిమిత్తం..  మల్టీ డిసిప్లినరీ బృందాలను ఏర్పాటు చేశామని, ఇందులో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందితో పాటు,రెవెన్యూ,ఆశ,అంగన్ వాడి కార్యకర్తలు,ఏ ఎన్ ఎం లు ఉన్నారని తెలిపారు.  అందరూ 5 రోజుల్లో జిల్లాలోని లక్షా ఎనభై తొమ్మిది వేల ఇండ్లను కవర్  చేసేలా లక్ష్యంగా తీసుకున్నట్లు తెలిపారు. ఇంటింటా ఆరోగ్యం కార్యక్రమం సందర్భంగా 40 వేల కిట్లు రూపొందించామని, ప్రతి ఇంటికి వెళ్లి అక్కడ పరిస్థితిని గమనించి అవసరమైన చోట చికిత్స అందించడం జరుగుతుందని తెలిపారు.  ప్రతి మండలానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించామని, శుక్రవారం నుండి ఉదయం ఏడు గంటలకే గ్రామాలకు వెళ్లి సర్వేను ప్రారంభించామని, కరోనా నివారణలో గతం కన్నా మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.

 ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కె.సి.నరసింహులు, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు రాజేశ్వర్ గౌడ్, డిసిసిబి ఉపాధ్యక్షులు కొరమోని వెంకటయ్య, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కృష్ణ ,మున్సిపల్ కమిషనర్  ప్రదీప్ కుమార్ ,మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు తిరుపతిరెడ్డి ,మున్సిపల్ అధికారులు, ప్రజా ప్రతినిధులు త‌దిత‌ద‌రులు పాల్గొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios