Asianet News TeluguAsianet News Telugu

ఈటల భద్రతపై డీజీపీకి నివేదిక: మాజీ మంత్రితో మేడ్చల్ డీసీపీ భేటీ

మాజీ మంత్రి ఈటల రాజేందర్ తో  మేడ్చల్ డీసీపీ సందీప్ రావు   గురువారంనాడు భేటీ అయ్యారు. రాజేందర్ భద్రత విషయమై  డీసీపీ  చర్చించారు.

Medchal DCP  Sandeep  meets  Former  Minister  Etela Rajender  lns
Author
First Published Jun 29, 2023, 12:11 PM IST


హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ చెప్పిన  అంశాలను డీజీపీకి వివరించనున్నట్టుగా  మేడ్చల్ డీసీపీ సందీప్ రావు  చెప్పారు.గురువారంనాడు  మేడ్చల్ డీసీపీ సందీప్ రావు  హైద్రాబాద్ షామీర్ పేటలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ తో భేటీ అయ్యారు.  అరగంట  పాటు  రాజేందర్ తో  మేడ్చల్ డీసీపీ  చర్చించారు. ఈటల రాజేందర్ హత్యకు  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ  పాడి కౌశిక్ రెడ్డి  సుఫారీ ఇచ్చారని  ఆరోపణలు  వచ్చాయి.  ఈ విషయమై  డీసీపీ సందీప్ రావు  మాజీ మంత్రి ఈటల రాజేందర్ తో చర్చించారు.   ఈటల రాజేందర్ భద్రత విషయమై  డీజీపీకి  నివేదిక  ఇవ్వనున్నారు  మేడ్చల్ డీసీపీ. ఈటల రాజేందర్  నివాసాన్ని  నిన్ననే మేడ్చల్  డీసీపీ  సందీప్ రావు  పరిశీలించారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ  కౌశిక్ రెడ్డితో  తనకు ప్రాణ హాని ఉందని  డీసీపీకి  మాజీ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారని సమాచారం.  ఈటల రాజేందర్  భద్రత విషయమై  డీజీపీకి వివరించనున్నట్టుగా  మేడ్చల్ డీసీపీ  సందీప్ రావు  చెప్పారు. తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ నేతృత్వంలోని  పోలీస్ ఉన్నతాధికారుల బృందం  ఈటల రాజేందర్  భద్రత విషయమై  నిర్ణయం తీసుకొనే  అవకాశం ఉంది.  

ఈటల రాజేందర్ ను  చంపేందుకు  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ  కౌశిక్ రెడ్డి  సుఫారీ  ఇచ్చారని  ఈటల జమున  ఇటీవల  ఆరోపణలు  చేశారు.ఈ ఆరోపణల నేపథ్యంలో  మేడ్చల్ డీసీపీ  సందీప్ రావు  ఈటల రాజేందర్ తో సమావేశమయ్యారు. 

ఈటల రాజేందర్  భద్రత విషయమై  తెలంగాణ  ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది.  ఈ విషయమై  తెలంగాణ మంత్రి కేటీఆర్ నిన్న  డీజీపీ అంజనీకుమార్ తో  ఫోన్ లో మాట్లాడారు.  ఈటల రాజేందర్ భద్రతపై  ఆరా తీశారు.సీనియర్ ఐపీఎస్ అధికారితో భద్రతను వెరిఫై చేయించాలని మంత్రి కేటీఆర్  ఆదేశించారు.దీంతో  మేడ్చల్ డీసీపీ  రెండు  రోజులుగా  ఈటల రాజేందర్  నివాసాన్ని నిన్న పరిశీలించారు. ఇవాళ రాజేందర్ తో సమావేశమయ్యారు.

also read:ఈటల హత్యకు సుఫారీ ఆరోపణలు: రాజేందర్‌తో భేటీ కానున్న మేడ్చల్ డీసీపీ

సుఫారీ ఆరోపణల నేపథ్యంలో  ఈటల రాజేందర్ కు  కేంద్ర ప్రభుత్వం  వై కేటగిరి భద్రతను  కేటాయించాలని  యోచిస్తుందని  ప్రచారం సాగుతుంది.  ఈ తరుణంలో  రాష్ట్ర ప్రభుత్వమే  ఈటల రాజేందర్ కు  భద్రతను  కల్పించాలని  భావిస్తుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios