Asianet News TeluguAsianet News Telugu

అక్కాచెల్లెళ్ల ముద్దుల మొగుడు..తెలంగాణలో ఒకేసారి ఇద్దరితో పెళ్లి.. !

ఒకే వరుడు అక్కాచెల్లెళ్లను పెళ్లి చేసుకుంటున్న ఘటనలు ఇటీవల చాలానే వెలుగుచూస్తున్నాయి. తాజాగా మెదక్ జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. ఒకే పెళ్లి పందింట్లో అక్కాచెల్లెళ్లకు ఓ యువకుడు ఒకేసారి తాళి కట్టాడు.

medak man marries two sister at the same time - bsb
Author
Hyderabad, First Published May 24, 2021, 11:50 AM IST

ఒకే వరుడు అక్కాచెల్లెళ్లను పెళ్లి చేసుకుంటున్న ఘటనలు ఇటీవల చాలానే వెలుగుచూస్తున్నాయి. తాజాగా మెదక్ జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. ఒకే పెళ్లి పందింట్లో అక్కాచెల్లెళ్లకు ఓ యువకుడు ఒకేసారి తాళి కట్టాడు.

కొద్ది రోజుల కిందట కర్నాటక లోని కోలార్ జిల్లాలో జరిగిన పెళ్లిలాంటిదే.. సేమ్ టు సేమ్ ఈ పెళ్లి కూడా. మెదక్ జిల్లా కొల్చారం మండలం అంసాన్ పల్లి గ్రామంలో తాజాగా ఈ ఘటన జరిగింది. 

గ్రామానికి చెందిన గొల్పాల వెంకటేశ్ కు స్వాతి, శ్వేత ఇద్దరు కూతుళ్లు, పెద్దమ్మాయి స్వాతికి శివ్వంపేట మండలం పాంబండకు చెందిన మేనబావ అయిన బాల్ రాజ్ తో పెళ్లి నిశ్చయమయింది. కాగా రెండో కూతురు శ్వేతకు మతిస్థిమితం సరిగా లేదు. 

దీంతో తల్లిదండ్రులే శ్వేతను కూడా బాల్ రాజ్ కే ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించారు. దీనికి బాల్ రాజ్ కూడా ఒప్పుకున్నాడు. దీంతో పెళ్లి పత్రికల్లోనూ వరుడితో పాటు ఇద్దరు అమ్మాయిల పేర్లు ముద్రించి, పంచిపెట్టారు. 

ఆ తరువాత గుట్టు చప్పుడు కాకుండా ఆదివారం వివాహం జరిపించారు. పెళ్లైతే జరిగింది కానీ.. వరుడు అక్క స్వాతిని మాత్రమే తనతో కాపురానికి తీసుకువెళ్లాడు. మతిస్థిమితం లేని శ్వేతను తండ్రి ఇంటి దగ్గరే ఉంచుకున్నాడు. 

చెల్లెని కూడా పెళ్లాడితేనే... నా మెడలో తాళి.. అక్క మొండిపట్టు.....

కాగా, వారం రోజుల క్రితం కర్ణాటకలోని కోలార్ లో స్వయంగా ఓ అక్కే తన చెల్లిని కూడా పెళ్లి చేసుకోవాలని.. వరుడిని పట్టుబట్టింది.. అలాగయితేనే తానూ పెళ్లికి అంగీకరిస్తానని మొండికేసింది. దీంతో వరుడు ఇద్దరి మెడలోనూ తాళి కట్టాడు. ఈ విచిత్రం సంఘటన కర్ణాటకలో జరిగింది. 

తన చెల్లిని కూడా వివాహం చేసుకోవాలని అక్క కాబోయే భర్తను పట్టుబట్టి ఒప్పించడం విశేషం. వివరాలలోకి వెళ్తే తాలూకాలోని తిమ్మరావుతనహళ్ళి గ్రామ పంచాయితీ  వేగమడుగు గ్రామానికి చెందిన రాణెమ్మ, నాగరాజప్ప రైతు దంపతుల కుమార్తెలు సుప్రియ, లలితలు. చెల్లెలు లలిత మూగ-బధిర. ఆమెను ఎవరు పెళ్లి చేసుకుంటారని అక్క సుప్రియ బాధపడేది.

ఈ తరుణంలో సుప్రియకు చెందిన ఉమాపతి అనే యువకుడితో పెళ్లి నిశ్చయమైంది. ఈ నెల ఏడవ తేదీన పెళ్లి మండపంలో బరువు తాళి కట్టబోతుండగా సుప్రియ తన ఆలోచన చెప్పింది. చెల్లిని కూడా నీవు పెళ్లాడితే కానీ ఈ వివాహం జరగదని మొండికేయడంతో పెద్దల అనుమతితో ఉమాపతి ఇద్దరికీ మాంగళ్యధారణ చేశాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios