మెదక్ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2024

భారత తొలి మహిళా ప్రధాని, ఉక్కు మహిళ ఇందిరా గాంధీతో పాటు తెలంగాణ తొలి సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ఆలే నరేంద్ర, సినీనటి విజయశాంతి వంటి అతిరథ మహారథులు ప్రాతినిథ్యం వహించిన నియోజకవర్గం మెదక్. 1952లో నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి మెదక్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం చెలాయించింది. మధ్యలో టీడీపీ, బీజేపీలు గెలిచినా బీఆర్ఎస్ పార్టీకి పెట్టని కోటగా మారింది. మెదక్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో సిద్ధిపేట, మెదక్, నర్సాపూర్, సంగారెడ్డి, పటాన్ చెరు, దుబ్బాక, గజ్వేల్ అసెంబ్లీ స్థానాలున్నాయి. పదేళ్ల తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మెదక్ లోక్‌సభ స్థానంలో పాగా వేయాలని భావిస్తోంది. బీఆర్ఎస్‌ పార్టీలో మెదక్ టికెట్ కోసం తీవ్ర పోటీ నెలకొంది. బీజేపీలోనూ మెదక్ టికెట్ కోసం ఆశావహులు భారీగా వున్నారు. 

medak lok sabha elections result 2024 ksp

భిన్న సంస్కృతులకు నెలవు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం.  ఆది నుంచి ప్రజా ఉద్యమాలకు కేంద్రంగా నిలిచింది. కాకలు తీరిన రాజకీయ యోధులకు పుట్టినిల్లు మెదక్. భారత తొలి మహిళా ప్రధాని, ఉక్కు మహిళ ఇందిరా గాంధీతో పాటు తెలంగాణ తొలి సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ఆలే నరేంద్ర, సినీనటి విజయశాంతి వంటి అతిరథ మహారథులు ప్రాతినిథ్యం వహించిన నియోజకవర్గం మెదక్.

ఎమర్జెన్సీ, జనతా పార్టీ కుప్పకూలిన తర్వాత 1980 లోక్‌సభ ఎన్నికల్లో ఇందిరా గాంధీ తన కుటుంబానికి కంచుకోటగా వున్న రాయబరేలితో పాటు మెదక్ నుంచి కూడా పోటీ చేశారు. రెండు చోట్లా గెలిచిన ఆమె.. రాయబరేలి ఎంపీ పదవికి రాజీనామా చేసి మెదక్ ఎంపీగా కొనసాగారు. 1984లో హత్యకు గురయ్యే వరకు ఇందిరా గాంధీ మెదక్ పార్లమెంట్ సభ్యురాలిగానే వున్నారు. ఇటీవల కన్నుమూసిన ప్రజా యుద్ధనౌక గద్ధర్ మెదక్ ప్రాంతానికి చెందినవారే. 

మెదక్ ఎంపీ (లోక్‌సభ) ఎన్నికల ఫలితాలు 2024 .. బీఆర్ఎస్ కంచుకోట:

1952లో నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి మెదక్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం చెలాయించింది. మధ్యలో టీడీపీ, బీజేపీలు గెలిచినా బీఆర్ఎస్ పార్టీకి పెట్టని కోటగా మారింది. ఆ పార్టీ అగ్రనేతలు కేసీఆర్, హరీష్ రావు , కొత్త ప్రభాకర్ రెడ్డిలు ఇదే పార్లమెంట్ పరిధిలో ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2004 నుంచి నేటి వరకు మెదక్ గడ్డపై గులాబీ జెండా రెపరెపలాడుతూనే వుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 9 సార్లు, ఉప ఎన్నికలతో కలిపి బీఆర్ఎస్ 5 సార్లు, బీజేపీ , బీఆర్ఎస్, టీడీపీ, పీడీఎఫ్‌లు ఒక్కోసారి విజయం సాధించాయి. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 16,03,318 మంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 11,50,223 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోగా.. 71.74 శాతం పోలింగ్ నమోదైంది. 

మెదక్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో సిద్ధిపేట, మెదక్, నర్సాపూర్, సంగారెడ్డి, పటాన్ చెరు, దుబ్బాక, గజ్వేల్ అసెంబ్లీ స్థానాలున్నాయి. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ పరిధిలోని 7 శాసనసభ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ 6 స్థానాలను కైవసం చేసుకోగా.. ఒక చోట కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్ధి కొత్త ప్రభాకర్ రెడ్డికి 5,96,048 ఓట్లు.. కాంగ్రెస్ అభ్యర్ధి గాలి అనిల్ కుమార్ రెడ్డికి 2,79,621 ఓట్లు.. బీజేపీ అభ్యర్ధి రఘునందన్ రావుకు 2,01,567 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా బీఆర్ఎస్ 3,16,427 ఓట్ల మెజారిటీతో మెదక్‌లో విజయం సాధించింది. 

మెదక్ ఎంపీ (పార్లమెంట్) ఎన్నికల ఫలితాలు 2024 .. బీఆర్ఎస్‌కు బీజేపీ, కాంగ్రెస్ పోటీ ఇవ్వగలవా :

దాదాపు పదేళ్ల తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మెదక్ లోక్‌సభ స్థానంలో పాగా వేయాలని భావిస్తోంది. అయితే మెదక్ కేసీఆర్ కుటుంబానికి సొంత జిల్లా కావడంతో పాటు ఈ ప్రాంతంలో బీఆర్ఎస్ బలంగా వుండటంతో కాంగ్రెస్ ఏ మేరకు పోటీనిస్తుందో చూడాలి. కేసీఆర్, హరీశ్‌రావులు మెదక్ లోక్‌సభ పరిధి నుంచే అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వీరిని ఎదుర్కొని హస్తం పార్టీ విజయం సాధించాల్సి వుంటుంది.

మెదక్ లోక్‌సభ టికెట్ కోసం మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన ఇదే ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడం, ఆర్ధికంగా , సామాజికంగా బలమైన వ్యక్తి కావడం అన్నింటికి మించి సీఎం రేవంత్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు వుండటంతో మైనంపల్లికి టికెట్ ఖరారైనట్లుగా ప్రచారం జరుగుతోంది. అలాగే పటాన్ చెరుకు చెందిన బీసీ నేత నీలం మధు కూడా మెదక్ టికెట్ ఆశిస్తున్నారు. 

ఇక బీఆర్ఎస్‌ పార్టీలో మెదక్ టికెట్ కోసం తీవ్ర పోటీ నెలకొంది. పార్టీకి పట్టున్న ప్రాంతం కావడంతో ఇక్కడ గెలవడం పక్కా అన్న నమ్మకం నేతల్లో వుండటమే ఇందుకు కారణం. సిట్టింగ్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి తాజా అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక ఎమ్మెల్యేగా గెలిచారు. మదన్ రెడ్డి, సిద్ధిపేట మాజీ కలెక్టర్, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి, వంటేరు ప్రతాప్ రెడ్డి, గాలి అనిల్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణలు మెదక్ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. బీజేపీలోనూ మెదక్ టికెట్ కోసం ఆశావహులు భారీగా వున్నారు. మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు, గోదావరి అంజిరెడ్డిల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios