మెదక్ కలెక్టరేట్ లో డిప్యూటీ తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న నారాయణపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటేసింది.
మెదక్: మెదక్ కలెక్టరేట్ లో డిప్యూటీ తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న నారాయణపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటేసింది.
జిన్నారం మండలంలో పనిచేసిన తహసీల్దార్ కొంతకాలం క్రితం మరణించాడు. చనిపోయిన తహాసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ పట్టాదారు పాసుబుక్కులను సృష్టించినట్టుగా గుర్తించి ఆయనపై చర్యలు తీసుకొన్నారు.
ఈ వ్యవహారంలో వీఆర్ఓ పాత్ర ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. ఆయనపై కూడ చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకొన్నారు. ఆయనపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
జిన్నారం మండలంలో తహాసీల్దార్ గా పనిచేసి మృతి చెందిన వ్యక్తి పేరుతో నకిలీ పట్టా సర్టిఫికెట్లు సృష్టించారు. నకిలీ పట్టాలు సృష్టించడంలో వీరి పాత్ర ఉందని తేలడంతో బొల్లారం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. కామారెడ్డి ఆర్డీఓతో పాటు మెదక్ కలెక్టరేట్ లో పనిచేస్తున్న డీప్యూటీ తహాసీల్దార్ పై సస్పెన్షన్ వేటు పడింది.
మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ చిప్పల్‌తుర్తిలో 112 ఎకరాల భూమికి ఎన్ఓసీ కోసం రూ.1.12 కోట్ల లంచం డిమాండ్ చేశాడు. ఈ విషయంలో రూ. 40 లక్షలు లంచం తీసుకొంటూ ఆయన ఏసీబీ అధికారులకు చిక్కిన విషయం తెలిసిందే.
