Asianet News TeluguAsianet News Telugu

అసైన్డ్ ల్యాండ్స్ కబ్జా చేసిన ఈటెల రాజేందర్: తేల్చిన నివేదిక

ఉమ్మడి మెదక్ జిల్లాలోని మాసాయిపేట పరిసరాల్లోని గ్రామాల్లోని అసైన్డ్ భూములు జమున హేచరీస్ ఆధీనంలో ఉన్నాయని కలెక్టర్ నివేదిక ఇచ్చారు.

Medak collector submits report on Etela Rajender land grabbing allegations lns
Author
Hyderabad, First Published May 2, 2021, 4:53 PM IST

హైదరాబాద్: ఉమ్మడి మెదక్ జిల్లాలోని మాసాయిపేట పరిసరాల్లోని గ్రామాల్లోని అసైన్డ్ భూములు జమున హేచరీస్ ఆధీనంలో ఉన్నాయని కలెక్టర్ నివేదిక ఇచ్చారు.ఈటల రాజేందర్ కుటుంబానికి చెందిన జమున హేచరీస్ సంస్థ ఆధ్వర్యంలో అసైన్డ్ భూముల విషయమై మీడియాలో  రెండు రోజుల క్రితం పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. ఈ విషయమై విచారణకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. వెంటనే నివేదిక ఇవ్వాలని కూడ ఆదేశించారు. 

also read:ఈటెల రాజేందర్ స్వగ్రామం కమలాపూర్ లో భారీగా పోలీసుల మోహరింపు

జమున హేచరీస్ సంస్థ ఆధీనంలోనే  అసైన్డ్ భూములు ఉన్నాయని కలెక్టర్ నివేదిక అందించారు. హకీంపేట, అచ్చంపేట గ్రామాల్లో భూముల కబ్జా జరిగినట్టుగా దర్యాప్తు అధికారులు నిగ్గు తేల్చారు. అసైన్డ్ ల్యాండ్స్ ను ఈటల రాజేందర్ కబ్జా చేశారని  నివేదిక అందించారు  తమను బెదిరించి ఈ భూములను లాక్కొన్నారని బాధితులు ఫిర్యాదు చేసినట్టుగా కలెక్టర్ తెలిపారు.

అనుమతులు లేకుండా జమున హేచరీస్ సంస్థ షెడ్డులు నిర్మించిందని కలెక్టర్ నివేదికలో తెలిపారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులను కూడ ఆ సంస్థ ఎగ్గొట్టిందని ఆ నివేదికలో ప్రభుత్వానికి కలెక్టర్ తెలిపారు. .అయితే ఈ విషయమై సిట్టింగ్ జడ్జితో కూడ విచారణ జరిపించాలని కూడ ఈటల రాజేందర్ కూడ కోరిన విషయం తెలిసిందే. ఈటల రాజేందర్ నుండి వైద్య ఆరోగ్యశాఖ పోర్టుపోలియోను కూడ మార్చారు.ఈ శాఖను కేసీఆర్ తన వద్ద ఉంచుకొన్నారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios