బాలల సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన బాల రక్షక్ వాహనాలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం మహిళల, బాలల సంరక్షణ కోసం చర్యలు తీసుకుంటోందని ఆయన అన్నారు. 

తెలంగాణ ప్రభుత్వం మహిళల, బాలికల సంరక్షణ కోసం అనేక చర్యలు తీసుకుంటోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం ఆయన వెస్ట్ మారేడ్ పల్లి లోని ఆయన నివాసం వద్ద రెండు బాల రక్షక్ వాహనాలను కలెక్టర్ శర్మన్ తో కలిసి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మంత్రి మాట్లాడారు. ఆపదలో ఉన్న బాలలను ర‌క్షించ‌డం కోసం ఈ వాహ‌నాలు ఏర్పాటు చేశామ‌ని చెప్పారు. ఇప్ప‌టికే బాల‌ల కోసం తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం 1098 హెల్ప్ లైన్ ఏర్పాటు చేసింద‌ని అన్నారు. ఇప్ప‌డు జిల్లాకు ఒకటి చొప్పున ఈ వాహ‌నాలను స‌మ‌కూరుస్తుంద‌ని అన్నారు. అందులో భాగంగా హైద‌రాబాద్ జిల్లాకు రెండు వాహ‌నాలు కేటాయించామ‌ని తెలిపారు. అందులో ఒక దానిని నేడు ప్రారంభించామ‌ని అన్నారు. 

అతివేగం : టూ వీలర్ ట్యాంక్ పగిలి ఇద్దరు యువకులు సజీవ దహనం..

బాల్య వివాహాలు జ‌రుగుతున్నా, 18 ఏళ్ల లోపు చిన్నారులు భిక్షాట‌న చేస్తూ క‌నిపించినా 1098 అనే హెల్ప్ లైన్ నెంబ‌ర్ కు కాల్ చేయాల‌ని మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ చెప్పారు. అనాధ బాల‌లు ఉన్నా కూడా ఈ నెంబ‌ర్ కు కాల్‌చేయాల‌ని సూచించారు. ఇలా చేయ‌డం వ‌ల్ల ప్ర‌భుత్వానికి చెందిన బాల‌ రక్షక్ వాహనం అక్కడికి వెంట‌నే చేరుకుంటుంద‌ని తెలిపారు. పౌరులు కాల్ చేసిన వెంట‌నే ఆ ప్రాంతానికి బాల ర‌క్ష‌క్ వాహ‌నంలో ప్రొటెక్షన్ ఆఫీసర్, జిల్లా బాలల సంరక్షణ యూనిట్ ఆఫీసర్లు వ‌స్తార‌ని వివ‌రించారు. అక్క‌డ నెల‌కొన్న ప‌రిస్థితుల‌ను బ‌ట్టి పోలీస్ డిపార్ట్‌మెంట్, రెవెన్యూ డిపార్ట్‌మెంట్ ఆఫీస‌ర్ల సహాయం తీసుకుంటార‌ని తెలిపారు. అనంత‌రం ఆ పిల‌ల్ల‌ను బాల స‌ద‌న్‌కు తీసుకొస్తార‌ని, అక్క‌డ ప్ర‌భుత్వ‌మే వారి ఆల‌నా, పాల‌న చూసుకుంటుంద‌ని తెలిపారు. ఇలా చిన్నారుల సంర‌క్ష‌ణ కోసం తెలంగాణ ప్ర‌భుత్వం ఎన్నో చ‌ర్యలు తీసుకుంటోంద‌ని అన్నారు. 

ఏపీ, తెలంగాణలకు కేంద్రం పిలుపు: విభజన సమస్యలపై జనవరి 12న సీఎస్‌లతో కేంద్ర హోం:శాఖ కీలక భేటీ