ఓ మెడికల్ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం నిజామాబాద్ లో కలకలం రేపింది. హాస్టల్ గదిలోనే సనత్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.
నిజామాబాద్ : నిజామాబాద్ లో ఓ షాకింగ్ ఘటన జరిగింది. నిజామాబాద్ మెడికల్ కాలేజీలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మెడికల్ కాలేజీ హాస్టల్ గదిలో ఉరివేసుకుని సనత్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. సనత్ ను పెద్దపల్లి జిల్లాకు చెందిన విద్యార్తిగా గుర్తించారు. సనత్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
