తెలంగాణ కరోనా కేసులు నానాటికీ పెరుగుతుండటంతో మరో కీలక నిర్ణయం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ముఖ్యంగా విద్యాసంస్థలు కోవిడ్‌కు హాట్ స్పాట్‌గా మారుతున్న నేపథ్యంలో విద్యార్ధుల ఆరోగ్యాన్ని దృష్టిలో వుంచుకుని ఇంటర్మీడియట్ పరీక్షలను వాయిదా వేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

కరోనా కేసులు అనూహ్యంగా పెరుగుతుండటంతో పరీక్షలను వాయిదా వేయాలని యోచిస్తోంది. అలాగే పదో తరగతి పరీక్షలను కూడా రద్దు చేసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే సీబీఎస్‌ఈ పరీక్షలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అదే దారిలో తెలంగాణ సర్కార్ కూడా నడవాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించి రాత్రికి ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. 

మరోవైపు తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ గణనీయంగా పెరుగుతున్నాయి. తాజాగా గత 24గంటల్లో (మంగళవారం రాత్రి 8గంటల నుండి బుధవారం రాత్రి 8గంటల వరకు) రాష్ట్రవ్యాప్తంగా 1,06,627మందికి కరోనా టెస్టులు చేయగా 3307మందికి పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,38,045కు చేరితే టెస్టుల సంఖ్య 1,13,60,001కు చేరాయి.

ఇక ఇప్పటికే కరోనా బారినపడి చికిత్స పొందుతున్నవారిలో తాజాగా 897మంది కోలుకున్నారు. దీంతో కరోనా నుండి రికవరీ అయినవారి మొత్తం సంఖ్య 3,08,396కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 27,861యాక్టివ్ కేసులు వున్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. ఇందులో హోం/సంస్థల ఐసోలేషన్ లో వున్న వ్యక్తుల సంఖ్య 18,685గా వుంది.

ఇదిలావుంటే గత 24గంటల్లో రాష్ట్రంలో కరోనాతో ఎనిమిది మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1788కి చేరింది. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.52శాతంగా వుంటే దేశంలో ఇది 1.2శాతంగా వుంది. రికవరీ రేటు దేశంలో 88.3శాతంగా వుంటే రాష్ట్రంలో మాత్రం 91.22శాతంగా వుంది.