ఎంత జాగ్రత్తగా ఉన్నా మాట్రిమోనియల్ మోసాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. అలా ఓ బ్యాంక్ మేనేజర్ ఓ యువతిని గుడ్డిగా నమ్మి రూ.46 లక్షలు పోగొట్టుకున్నాడు. తీరా ఆమె ఫోన్ స్విచాఫ్ రావడంతో అసలు విషయం బోధపడింది. 

 నారాయణగూడ : Matrimonial వెబ్సైట్ ద్వారా పరిచయమై marriage పేరుతో ఓ మహిళ 46 లక్షలు దోచేసిందని బాధితుడు హైదరాబాద్ cyber policeలకు ఫిర్యాదు చేశారు. ఏసీబీ కేవిఎం ప్రసాద్ కథనం ప్రకారం.. కోఠిలోని ఓ National Bank మేనేజర్ పెళ్లి సంబంధాలు వెతుకుతున్నాడు. ఓ వివాహ వెబ్సైట్లో తన వివరాలను పొందుపరిచాడు. అది చూసిన ఓ అమ్మాయి అతనికి ఫోన్ చేయింది. ‘మీరు నాకు నచ్చారు... మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను’ అని చెప్పింది. అంతే కాదు తాను ముంబైలో ఉంటానని ఫోటోలు, బయోడేటా పంపించింది. 

ఆ తరువాత కొంతకాలం చాటింగ్ చేసుకున్నారు. ఆ అమ్మాయి చూడాలని ఉంది.. అనడంతో ఆ వ్యక్తి ఓసారి ముంబైకి వెళ్లి ఆమెను కలిసి వచ్చాడు కూడా... ఆ తర్వాతే అసలు నాటం మొదలయ్యింది. ఒకసారి ‘మా అమ్మకు ఆరోగ్యం బాగాలేదు’ అని.. మరోసారి ‘నాన్నకు బాగాలేదని’ ఇలా వివిధ కారణాలు చెబుతూ బాధితుడి నుంచి డబ్బులు తీసుకుంది. అలా విడతలవారీగా రూ.46 లక్షలు దండుకుంది. ఆ తర్వాత ఆమె ఫోన్ స్విఛాఫ్ రావడం.. ఎంతకీ కలవకపోవడం.. మెసేజ్ లకూ రిప్లైలు రాకపోవడంతో.. తాను మోసపోయానని గ్రహించిన బ్యాంకు మేనేజర్ హైదరాబాద్ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇదిలా ఉండగా, tinder app ద్వారా పురుషులతో పరిచయం ఏర్పరచుకుని ప్రేమ పేరుతో దగ్గర కావడం ఆపై marriage చేసుకుని కొన్నాళ్లకు విడిపోవడమే పనిగా పెట్టుకుంది ఓ లేడి. మూడో భర్త ఆమె నిర్వాకాలపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళితే.. మైసూరులోని ఉదయగిరికి చెందిన నిధాఖాన్ గత రెండువేల పంతొమ్మిదిలో బెంగళూరులో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేసే ఆజమ్ఖాన్ తో పరిచయంపెంచుకుని పెళ్లి చేసుకుంది.

కొన్నిరోజులకే నిధా ఖాన్ ప్రవర్తన తేడాగా ఉండడంతో ఆజంఖాన్ ఆరా తీశాడు. ఆమె అప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకుని విడిపోయిందని గుర్తించాడు. ఆన్లైన్లో మరికొందరు పురుషులతో చాటింగ్ చేస్తోందని మైసూరులోని ఉదయగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరో వ్యక్తితో ఉండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నట్లు తెలిపాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

ఇలాంటి ఘటనే నిరుడు ఫిబ్రవరిలో తెలంగాణలోని హైదరాబాద్ లో జరిగింది. ఐపీఎస్ అధికారిని అని చెప్పి.. తన చెల్లితో పెళ్లి చేయిస్తానని చెప్పి ఓ వ్యక్తి నుంచి రూ. 11 కోట్లు వసూలు చేసిన ఓ యువతిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆ వ్యక్తి నుంచి ఆమె తీసుకున్న ఖరీధైన కార్లు, కోట్ల విలువైన ఆస్తుల వివరాలు తెలిసి పోలీసులే షాకయ్యారు. 

ఆమె ఈ మోసాలు తన బంధువుతో కలిసి చేసింది. ఆమెను ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. శృతిసిన్హా అనే యువతి ఐపీఎస్ అధికారిణిగా చలామణీ అవుతోంది. ఈ క్రమంలో వీరారెడ్డి అనే వ్యక్తిని కలిసింది. అతడి సోదరుడికి తన చెల్లిని ఇచ్చి వివాహం చేస్తానని శృతిసిన్హా నమ్మించింది. ఈ క్రమంలో అతడి వద్దనుంచి రూ.11 కోట్ల వరకు వసూలు చేసింది. ఆమె తన బంధువు విజయ్ కుమార్ రెడ్డితో కలిసి మోసానికి పాల్పడింది.