Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో భారీగా ఐపీఎస్ ల బదిలీలు.. ఎవరెవరు ఎక్కడెక్కడంటే..

తెలంగాణ ప్రభుత్వం 29మంది ఐపీఎస్ లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

Massive transfers of IPS officers in Telangana
Author
First Published Jan 4, 2023, 8:19 AM IST

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని మొత్తం 29మంది ఐపీఎస్ లను బదిలి చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. హైదరాబాద్ పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్ కు రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అదనపు డైరెక్టర్ జనరల్ గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. 

ఇక, పోలీస్ అకాడమీ డైరెక్టర్ గా సందీప్ శాండిల్య, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా రాజీవ్ రతన్, ఆర్గనైజేషన్, లీగల్ అదనపు డీజీగా శ్రీనివాస్ రెడ్డి.. పోలీసు సంక్షేమం, క్రీడల అదనపు డీజీగా అభిలాష బిస్తు, రైల్వే అదనపు డీజీగా శివధర్ రెడ్డిలకు అదనపు బాధ్యలు ఇచ్చారు. 

ప్రభుత్వం షికా గోయల్ ను మహిళా భద్రత, షీటీమ్స్ అదనపు డీజీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీరితోపాటు పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ అదనపు డీజీగా శ్రీనివాసరావు, టీఎస్ఎస్ పీ బెటాలియన్ అదనపు డీజీగా స్వాతి లక్రా, అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ గా నాగిరెడ్డి, గ్రేహౌండ్స్ ఆక్టోపస్ అదనపు డీజీగా విజయ్ కుమార్, హైదరాబాద్ ట్రాఫిక్ అదనపు సీపీగా సుధీర్ బాబు, మల్టీజోన్-2 ఐజీగా సానవాజ్ ఖాసి, ఐజీ(పర్సనల్)గా కమలాసన్ రెడ్డి, ఇంటెలిజెన్స్ డీఐజీగా కార్తికేయ, పోలీసు శిక్షణ ఐజీగా తరుణ్ జోషి, డీఐసీ (పీ అండ్ ఎల్)గా రమేష్, మల్టీజోన్-1 ఐజీగా చంద్రశేఖర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ డీఐజీగా కార్తికేయ, సీఏఆర్ సంయుక్త సీపీగా ఎం. శ్రీనివాసులు, రాజన్న జోన్ డీఐజీగా రమేష్ నాయుడు, సీఏఆర్ సంయుక్త సీపీగా ఎం. శ్రీనివాసులు, ఐఎస్డబ్ల్యూ డీఐజీగా తఫ్సీర్ ఇక్బాల్, యాదాద్రి జోన్ డీఐజీగా, నల్గొండ ఎస్పీగా అదనపు బాధ్యతలు  రెమా రాజేశ్వరి, రాచకొండ సంయుక్త సీపీగా గజరావు భూపాల్, సైబరాబాద్ ట్రాఫిక్ సంయుక్త సీపీగా నారాయణ నాయక్, కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ ఎస్పీగా ఆర్. భాస్కరన్, జోగులాంబ జోన్ డీఐసీగా ఎల్.ఎస్ చౌహాన్, హైదరాబాద్ సంయుక్త సీపీగా పరిమళ నియమితులయ్యారు. 

Follow Us:
Download App:
  • android
  • ios