Asianet News Telugu

మెట్ పల్లిలో దొంగల భీభత్సం... భారీగా బంగారం, వెండి, నగదు ఛోరీ

మెట్ పల్లి పట్టణంలో ఒకే రాత్రి మూడు ఇళ్లలో దోపిడీకి పాల్పడి భారీగా బంగారం, వెండితో పాటు నగదు దోచుకెళ్లారు దుండగులు. 

Massive Robbery At Metpalli  akp
Author
Jagtial, First Published Jul 5, 2021, 12:26 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

జగిత్యాల జిల్లాలో ఆదివారం రాత్రి దొంగలు హల్ చల్ చేశారు. మెట్ పల్లి పట్టణంలో ఒకే రాత్రి మూడు ఇళ్లలో దోపిడీకి పాల్పడి భారీగా బంగారం, వెండితో పాటు నగదు దోచుకెళ్లారు. ఇలా వరుస ఛోరీలతో మెట్ పల్లి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. 

పట్టణంలోని కళళానగర్ కాలనీలో తాళం వేసివున్న ఇళ్లను టార్గెట్ చేసుకున్నారు దొంగలు. చడిచప్పుడు కాకుండా ఇళ్లలోకి ప్రవేశించి దొపిడీకి పాల్పడ్డారు.మూడు ఇళ్లలో కలిపి 41 తులాల బంగారం,  20 కిలోల వెండితో పాటు మూడు లక్షల నగదును దొంగలు ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. 

విషాదం: చెరువులో ముగ్గురు బాలికల మృతదేహాలు.. !

బాధితుల ఫిర్యాదు మేరకు దొంగతనం జరిగిన ఇళ్లను స్థానిక పోలీసులు పరిశీలించారు. దొంగలను గుర్తించేందుకు ఆధారాలను పరిశీలిస్తున్నారు క్లూస్ టీం. దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగినట్లు పోలీసులు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios