Asianet News TeluguAsianet News Telugu

నేడే సామూహిక జాతీయ గీతాలాపన.. హాజరుకానున్న కేసీఆర్ ?

హైదరాబాద్ లో నేడు జరగనున్న సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో అబిడ్స్  కూడలిలో జరిగే కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొంటారని సమాచారం.

Mass national anthem today.. KCR to attend?
Author
Hyderabad, First Published Aug 16, 2022, 9:07 AM IST

హైదరాబాద్ : ‘స్వతంత్ర భారత వజ్రోత్సవాల’లో భాగంగా మంగళవారం ఉదయం పదకొండున్నర గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని అన్ని కూడళ్ల వద్ద జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. నగరంతో పాటు రాష్ట్రం అంతటా అన్ని ప్రధాన కూడళ్లలో సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని నిర్వహించాలని, అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఇప్పటికే ఆదేశించినట్లు సీఎస్ తెలిపారు. 

సీఎం కేసీఆర్ అబిడ్స్ కూడలిలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారని సమాచారం. సామూహిక జాతీయ గీతాలాపన సందర్భంగా కూడళ్ళలో నిమిషంపాటు అన్నివైపులా రెడ్ సిగ్నల్ వేయనున్నారు. ఈ సందర్భంగా సాధారణ ప్రజానీకానికి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని సీఎస్ తెలిపారు. కాగా ప్రస్తుత సచివాలయం బిఆర్కే భవన్ లో సీఎస్ సోమేశ్కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. 

రేపు సామూహిక జాతీయ గీతాలాపన.. హైదరాబాద్‌లోని అన్ని జంక్షన్‌లలో నిలిచిపోనున్న ట్రాఫిక్

Follow Us:
Download App:
  • android
  • ios