తెలంగాణ ప్రభుత్వం స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఈ నెల 8 నుంచి 22వ తేదీ వరకు పలు కార్యక్రమాలను నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ నెల 16న (మంగళవారం) ఉదయం 11 .30 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన చేపట్టున్నారు.

తెలంగాణ ప్రభుత్వం స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఈ నెల 8 నుంచి 22వ తేదీ వరకు పలు కార్యక్రమాలను నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ నెల 16న (మంగళవారం) ఉదయం 11 .30 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన చేపట్టున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం 11:30 గంటలకు నగరంలోని అన్ని జంక్షన్లలో ట్రాఫిక్‌ను నిలిపివేయనున్నట్టుగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు.

మంగళవారం ఉదయం 11:30 గంటలకు అన్ని పబ్లిక్ అడ్రస్ సిస్టమ్‌ల వద్ద జాతీయ గీతం ప్లే చేయబడుతుందని పోలీసులు చెప్పారు. అన్ని ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద రెడ్ సిగ్నల్‌ ఉండనుంది. అదే సమయంలో ట్రాఫిక్ పోలీసు సిబ్బంది కూడా జంక్షన్‌లలో సామూహిక జాతీయ గీతాలాపన చేయనున్నారు. ఇక, ట్రాఫిక్‌ జంక్షన్‌ల వద్ద ప్రయాణికులు నిలుచుని జాతీయ గీతాన్ని ఆలపించాలని పోలీసులు కోరారు.

ఇక, రేపు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే సామూహిక జాతీయ గీతాలాపనను విజయవంతం చేయడంలో పోలీస్‌శాఖ కీలకపాత్ర పోషించాలని తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అన్ని శాఖల అధికారులతో కలిసి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ట్రాఫిక్ జంక్షన్లలో సామూహిక జాతీయ గీతాలాపన కోసం ప్రజలు గుమిగూడే ప్రదేశాలను గుర్తించి.. ఉదయం 11.30గంటలకు ట్రాఫిక్‌ను నిలిపివేసి, అలారం మోగించేవిధంగా మైక్‌ సిస్టమ్స్‌ ఏర్పాట్లను చేయాలని ఆదేశించారు.