హైదరాబాద్: దళిత అల్లుడు ప్రణయ్ ను హత్య చేయించిన మారుతీ రావు మృతి మిస్టరీగానే మిగిలింది. ఆయనది హత్యనా, ఆత్మహత్యనా, సహజ మరణమా అనేది తేలడం లేదు. ఈ కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని వారు విచారణ జరుపుతున్నారు. 

హైదరాబాదులోని ఖైరతాబాద్ లో గల చింతల్ బస్తీ ఆర్యవైశ్య భవన్ గదిలో ఆయన మరణించిన విషయం తెలిసిందే. అయితే, అతను ఆత్మహత్య చేసుకున్న ఆనవాళ్లేమీ గదిలో లభించలేదని తెలుస్తోంది. ఆయన బస చేసిన ఆ గదలో విషం గానీ పురుగుల మందు డబ్బా కానీ పోలీసులకు లభిచంలేదు. దాంతో శనివారం సాయంత్రం 6.50 నుంచి 9 గంటల వరకు అంటే రెండు గంటల పాటు ఏం జరిగిందనే విషయాన్ని తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. 

Also Read: మారుతిరావు మృతదేహానికి ఎస్కార్ట్ సెక్యూరిటీ... హైదరాబాద్ నుండి మిర్యాలగూడకు...

మారుతీ రావు శనివారం ఆరు గంటల యాభై నిమిషాలకు ఆర్యవైశ్య యాభై నిమిషాలకు గదికి వచ్చాడు. గదిలోకి వచ్చిన తర్వాత కారు డ్రైవర్ ను పంపించి అల్పాహారం కోసం గారెలు తెప్పించుకున్నాడు. ఆ తర్వాత డ్రైవర్ ను కిందకు పంపించేసి గడియ పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది తెలియదు. అయితే గదిలో, వాష్ రూంలో, బాత్రూంలో మారుతీరావు వాంతులు చేసుకున్నట్లు గుర్తించారు. 

సంఘటనా స్థలంలో పోలీసులకు సూసైడ్ నోట్ కనిపించింది. అయితే, అందులోని రాత మారుతీరావుదేనా, కాదా అనే విషయాన్ని తేల్చుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. బయటకు వెళ్లిన మారుతీ రావు ఎవరిని కలిశారు, ఎక్కడికి వెళ్లారు అనే విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దానితో పాటు ఆయన కాల్ డేటా ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Also Read: మారుతీ రావు మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి.. : నివేదికలో ఏముంది.