సంతోష్ కుమార్ చివరి క్రతులు పూర్తయ్యాయి. ఆయన చితికి నిప్పు  పెట్టడంతో అంతిమ సంస్కారాలు పూర్తయ్యాయి. భరతమాత ముద్దుబిడ్డ సంతోష్ బాబు ఇక లేరు. కానీ దేశంకోసం ఆయన చేసిన ప్రాణత్యాగం,వీరమరణం, జ్ఝాపకాలు మాత్రమే ఇక గుర్తుండిపోతాయి. వీర మరణం పొందిన ఆయనను యావత్ దేశం గుర్తుంచుకుంటుంది.  

కల్నల్ సంతోష్ బాబుకు మృతికి నివాళిగా ఆర్మీ అధికారులు గాల్లోకి కాల్పులు జరిపారు. 

కల్నల్ సంతోష్ బాబుకు ఆయన తండ్రి, కొడుకులు చివరి క్రతులను నిర్వహిస్తున్నారు. 

సంతోష్ బాబు పార్థీవదేహాన్ని రాజకీయ ప్రముఖులు నివాళి అర్పిస్తున్నారు. 

కడసారి సంతోష్ కుమార్ ను చూసుకునే అవకాశాన్ని కుటుంబసభ్యులకు కల్పించారు. 

సంతొష్ బాబు పార్థీవదేహంపై వుంచిన జాతీయ పతాకాన్ని, డ్యూటీ సమయంలో ఆయన ధరించే ఆర్మీ డ్రెస్ ఇతర సామాగ్రిని భార్యకు అందించిన ఆర్మీ అధికారులు మృతదేహాన్ని చితిపైకి  చేర్చారు.

భరతమాత ముద్దుబిడ్డ సంతోష్ బాబు పార్థీవ దేహానికి చివరి సైనికవందనం అందిస్తున్నారు ఆర్మీ అధికారులు. 

కొడుకు చేత తలకొరివి పెట్టించుకోవాల్సిన ఆ తండ్రి సంతోష్ బాబు కు అంతిమ సంస్కారాలు చేపడుతున్నారు. అయితే దేశంకోసం తన కొడుకు  ప్రాణత్యాగం చేయడం తమకెంతో గర్వంగా వున్నా  తల్లిద్రండులుగా మాత్రం బాధపడుతున్నామన్నారు.

కల్నల్ సంతోష్ బాబు అంత్యక్రియలు జరిగే వ్యవసాయ క్షేత్రానికి రాజకీయ ప్రముఖులు, కుటుంబ సబ్యులు, ఆర్మీ అధికారులు, పోలీసులు పాల్గొన్నారు. మంత్రి జగదీష్ రెడ్డి, టిపిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన భార్య పద్మావతి రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి పళ్లంరాజు, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లు పాల్గొన్పారు. 

భారీగా పాల్గొన్న ప్రజలు, ఆర్మీ అధికారులు, పోలీసుల భద్రత నడుమ భరతమాత ముద్దుబిడ్డ సంతోష్ బాబు అంతిమయాత్ర రెండు గంటలపాటు సాగింది. 

సూర్యపేటలోని నివాసం నుండి ప్రారంభమైన కల్నల్ సంతోష్ బాబు అంతిమయాత్ర అంత్యక్రియలు జరిగే వ్యవసాయ క్షేత్రానికి చేరుకుంది. కాస్సేపట్లో  సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. 

నల్గొండ జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్ రెడ్డి దగ్గరుండి సంతోష్ బాబు అంతిమ సంస్కారాలకు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. తాజాగా అంత్యక్రియలు జరిగే వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాట్లను ఆయన పరిశీలిస్తున్నారు.

కరోనా వ్యాప్తిని సైతం లెక్కచేయకుండా ప్రజలు సంతోష్ బాబుకు నివాళి అర్పించేందుకు బయటకు వస్తున్నారు.  ముఖ్యంగా మహిళలు ఇళ్ల బయట, మేడపై నిల్చుని వీరమరణం పొందిన సంతోష్  బాబును చివరిచూపు చూస్తున్నారు. చాలామంది మాస్కులు ధరించి, శానిటైజర్లు వెంటబెట్టుకుని ఈ అంతిమయాత్రలో  పాల్గొన్నారు. 

సంతోష్ బాబు అంతిమయాత్రలో పాల్గొన్న ఆర్మీ అధికారులకు కూడా సూర్యాపేట ప్రజలు  గౌరవంతో సెల్యూట్ చేస్తున్నారు. అంతేకాకుండా వారిపై కూడా పూలవర్షం కురిపిస్తున్నారు. 

కల్నల్ సంతోష్ బాబు పార్థీవదేహాన్ని తరలిస్తున్న వాహనం వెనకాలే ఓ కారులో కుటుంబసభ్యులను తీసుకు వెళుతున్నాయి. తండ్రిని ఎక్కడికి తీసుకెళుతున్నారో... అసలు తండ్రికి ఏమయ్యిందో కూడా తెలియని ఆ ముక్కుపచ్చలారని చిన్నారులను చూసి ప్రతి ఒక్కరికి కన్నీరు ఆగడంలేదు. అలాగే సంతోష్ బాబు తల్లిదండ్రులు, భార్య  శోకం వర్ణనాతీతంగా వుంది. 

సైనిక అధికారిక లాంఛనాలతో సంతోష్ బాబు అంత్యక్రియలు జరగనున్నాయి. 

దేశంకోసం వీరమరణం పొందిన సంతోష్ యాత్రలో భారీగా పాల్గొన్న యువత త్రివర్ణ పతాకాలను చేతబూని జై భారత్, జైహింద్ నినాదాలు చేస్తున్నారు.  

సంతోష్ బాబు అంతిమయాత్ర భారీగా ప్రజలు పాల్గొన్నారు.  కరోనా నిబంధనల నేపథ్యంలో అంతిమయాత్ర కొనసాగే దారిపొడవునా పోలీసులు భారీకేడ్తను  ఏర్పాటు చేశారు. అయినప్పటికి భారీగా తరలొచ్చిన ప్రజలను అవి నియంత్రించలేకపోతున్నాయి. 

సంతోష్ బాబు అంత్యక్రియలను సూర్యాపేట శివారులోని కేసారం వద్దగల సొంత పొలంలో నిర్వహించనున్నారు. కరోనా నేపథ్యంలో ఈ కార్యక్రమంలో కేవలం 50మందిని మాత్రమే అనుమతించనున్నారు. 

అంతిమయాత్ర సాగుతుండగా రోడ్డు పక్కనున్న భవనాలపై నుండి సంతోష్ బాబు పార్థీవదేహంపై పూతవర్షం కురిపిస్తున్నారు.

భరతమాత ముద్దుబిడ్డ కల్నల్ సంతోష్ బాబు అంతిమయాత్రలో సూర్యాపేట వాసులు భారీగా  పాల్గొన్నారు. దీంతో పోలీసులు,ఆర్మీ అధికారులు ముందువరుసలో నిలబడి ఈ యాత్రలో పాల్లొన్నారు. 

భారత-చైనా సరిహద్దులో వీరమమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు అంతిమయాత్ర ప్రారంభమయింది. ఆయన పార్థివదేహాన్ని అంతిమయాత్ర రథంలోకి చేర్చారు. ఆర్మీ అధికారులు అన్ని ఏర్పాట్లను చూసుకుంటున్నారు. వారు ఉదయం సైనిక డ్రిల్ చేసిన తరువాత శవాన్ని వాహనంలోకి ఎక్కించారు. 

అంతకు ముందు పార్థివదేహానికి మంత్రి జగదీశ్ రెడ్డి, ఎంపీ కోమటి రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, శానంపూడి సైది రెడ్డి సహా అనేకమంది ప్రముఖులు నివాళులు అర్పించారు.