Asianet News TeluguAsianet News Telugu

ప్రేమించలేదని.. నడిరోడ్డుపై వివాహితపై కత్తితో యువకుడి దాడి...

ఓ వివాహితను ప్రేమించానంటూ వెంటబడ్డాడో యువకుడు. పెళ్లై, కొడుకు కూడా ఉన్న ఆమె అతని ప్రేమను నిరాకరించింది. దీంతో ఆమె మీద కత్తితో దాడికి తెగబడ్డాడు. 

married women attacked by young man for not accepting love in hyderabad
Author
Hyderabad, First Published May 28, 2022, 8:31 AM IST

హైదరాబాద్ :  hyderabad నగరంలో నడిరోడ్డుపై దారుణ జరిగింది. ఓ యువకుడు love పేరిట వివాహితను వేధిస్తూ ఆమె ఒప్పుకోకపోవడంతో కత్తితో దాడికి తెగబడ్డాడు. ఇష్టానుసారంగా పొడవడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ఈ సంఘటన కంచన్ బాగ్ పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు… కంచన్ బాగ్ పరిధిలోని  హఫీజ్ బాబా నగర్ ఎ-బ్లాక్ ప్రాంతానికి చెందిన నూర్ భాను (40) భర్త ఇంతియాజ్ రెండేళ్ల క్రితం మృతి చెందాడు. ప్రస్తుతం నూర్ భాను కుమారుడితో కలిసి ఉంటుంది.

కొంతకాలంగా అదే ప్రాంతానికి చెందిన షేక్ నసీరుద్దీన్  అలియాస్ హబీబ్ (32) ప్రేమపేరుతో ఆమెను వేధింపులకు గురి చేస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం నూర్ భాను  బాబా నగర్ ఉమార్ హోటల్ సమీపానికి రాగానే… షేక్ నసీరుద్దీన్  వెనక నుంచి యాక్టివా ద్విచక్రవాహనంపై వచ్చి ఆమె ముఖం, చేతులు, ఇతర ప్రాంతాల్లో కత్తితో దాడి చేశాడు. దీంతో బాధితురాలు అక్కడే స్పృహ కోల్పోయింది. స్థానికులు, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు బాధితురాలిని ఓవైసీ ఆస్పత్రికి తరలించారు. నిందితుడు పరారీలో ఉన్నాడు.

చంద్రాయణ గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ బాధితురాలిని నిందితుడికి శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చి ధైర్యం చెప్పారు.  ఇదిలా ఉండగా నిందితుడి మీద గతంలో కూడా బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు… అయినా అతనిలో ఎలాంటి మార్పు రాలేదు. 

కాగా, ఇలాంటి ఘటనే ఇది కూడా. Social mediaలో love పేరుతో యువతిని ఆమె కుటుంబ సభ్యులు తీవ్రంగా వేధిస్తున్న యువకుడిపై కరీంనగర్ పోలీసులు arrest చేశారు. వివరాల్లోకి వెళితే..  కోటి ఉమెన్స్ కాలేజీ లో Sanskrit teacherగా  పనిచేస్తున్న ఆదిత్య భరద్వాజ్,  కరీంనగర్లోని అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడి కుమార్తె ఉస్మానియా యూనివర్సిటీ లో 2019 నుంచి 2021 వరకు పీజీ కలిసి చదువుకున్నారు. కొద్ది రోజుల స్నేహం తర్వాత ఆ యువతిని ప్రేమిస్తున్నానని తెలుపగా ఆమె నిరాకరించింది.

అప్పటి నుంచి కక్ష పెంచుకున్న భరద్వాజ్ యువతిని, ఆమె కుటుంబ సభ్యులను వేధింపులకు గురి చేయడం మొదలుపెట్టాడు.  స్నేహంగా వుండే రోజుల్లో యువతి కుటుంబ సభ్యులతో తీయించుకున్న పాత ఫోటోలను మార్పింగ్ చేసి వేధించసాగాడు. వీలైన ప్రతిచోటా ఆన్లైన్లో యువతికి, కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టేవాడు. పెళ్లి చేసుకోకుంటే యాసిడి పోస్తానని బెదిరింపులకు గురి చేసేవాడు. తెలంగాణ మోడల్ స్కూల్ గంగాధర సోషల్ మీడియా అకౌంట్ ను ట్యాగ్ చేస్తూ ఇష్టారాజ్యంగా పోస్టులు పెట్టేవాడు. అతడి వేధింపులు భరించలేని యువతి ఈనెల 10న గంగాధర పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఫిర్యాదు అందుకున్న పోలీసులు లోతుగా విచారణ ప్రారంభించారు.  భరద్వాజ్ కదలికలపై దృష్టిపెట్టారు. వనపర్తిలోని ఓ ఫంక్షన్ కు వెళ్లగా అక్కడ అరెస్టు చేశారు. వేములవాడ కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు. పోలీసులు అరెస్టు చేయగా  కొందరు తీసిన వీడియోలు సోషల్ మీడియాలో రావడంతో కిడ్నాప్ అంటూ వార్తలు వచ్చాయి. దీనిపై వనపర్తిలోని ఒక పోలీసు అధికారి వివరణ ఇస్తూ.. కిడ్నాప్ కాదు ఓ కేసులో అరెస్టు చేసినట్లు వివరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios