హైదరాబాద్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. కట్టుకున్న భర్తతో పాటు అత్తింటివారి వేధింపులు తట్టుకోలేక ఓ గృహిణి ఆత్మహత్యకు పాల్పడింది.ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరేసుకుని వివాహిత ప్రాణాలు వదిలింది. 

ఈ విషాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.  ముషీరాబాద్ ప్రాంతానికి చెందివ మహ్మద్ దస్తగిరికి కర్ణాటక గుల్గర్గా జిల్లాకు చెందిన మహ్మదా బేగంతో వివాహమైంది. అయితే పెళ్లి మొదలు మహ్మదా బేగం ను అత్తవారింట్లో మామ, తోటికోడళ్లు వేధింపులకు పాల్పడేవారు. దీంతో భార్యాభర్తలిద్దరు మహ్మద్‌గూడలో వేరు కాపురం పెట్టారు. 

అయితే ఇలా వేరుగా వుంటున్నప్పటికి మహ్మదాబేగంపై వేదింపులు కొనసాగాయి. భర్త నిత్యం ఆమెపై బౌతికంగా దాడి చేయడం, తీవ్ర పదజాలంతో దూషించడం చేసేవాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన సదరు మహిళ దారుణమైన నిర్ణయం తీసుకుంది. 

ఇంట్లో భర్త  లేసి సమయంలో మహ్మదా బేగం చీరతో సీలింగ్ ప్యాన్ కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఆత్మహత్యకు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.