హైదరాబాద్ శివారు ప్రాంతమైన హయత్ నగర్ లో దారుణం చోటుచేసుకుంది. ఓ వివాహితను ఓ గుర్తు తెలియని దుండగులు అత్యంత దారుణంగా హతమార్చారు. దుండగుల  పైశాచిక చర్యల కారణంగా తీవ్రంగా గాయపడిన వివాహిత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది.

ఈ దుర్ఘటనకకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా  ఉన్నాయి. హయత్ నగర్ ఆర్టీసి కాలనీలో ప్రశాంతి అనే వివాహిత నివాసముంటోంది. అయితే ఆమె ఆదివారం కొందరు గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు. ఒంటరిగా వున్న ప్రశాంతిని తీవ్రంగా కొట్టిన  దుండగులు ఆ తర్వాత తమతో పాటు తెచ్చుకున్న పెట్రోల్ ను ఆమెపై పోసి నిప్పింటించారు. అనంతరం అక్కడి నుండి పరారయ్యారు. 

మంటల్లో కాలిపోతూ ప్రశాంతి పెట్టిన కేకలు విన్న చుట్టుపక్కల వారు ఆమెను కాపాడారు. సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఇలా శరీరమంతా పూర్తిగా కాలిన గాయాలతో చికిత్స పొందుతూ ప్రశాంతి మృతిచెందింది.  ఈ వార్త తెలిసి ఆర్టీసి కాలనీలో విషాదం నెలకొంది.

ఈ దుర్ఘటనపై కేసు నమోదు చేసుకున్న సంఘటనా స్థలాన్ని  పరిశీలించారు. ఇంత దారుణంగా వివాహితను హత్య చేయడానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతి త్వరలో హత్యకు పాల్పడిన నిందితున్ని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.