ఫేస్‌బుక్‌లో పరిచయమైన వ్యక్తితో తన భార్య వెళ్లిపోయిందని ఆమె భర్త కరన్‌కోట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్‌ఐ సంతోష్‌కుమార్‌ కథనం ప్రకారం.. తాండూరు మండలం కోత్లాపూర్‌కు చెందిన విక్రమ్‌గౌడ్‌కు అదే గ్రామానికి చెందిన అనితను తొమ్మిదేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి సంతానం లేదు. అయితే, అనితకు కొన్ని రోజుల క్రితం ఫేస్‌బుక్‌లో అలీ ఇమ్రాన్‌ షేక్‌ అనే వ్యక్తితో పరిచయమైంది. 

గత నెల 26న ఆమె ఇంట్లోంచి వెళ్లిపోయింది. తెలిసిన వారి వద్ద, బంధువుల వద్ద అనిత అచూకీ కోసం గాలించినా ఫలితం లేకుండా పోయింది. ఫేస్‌బు క్‌లో పరిచయమైన వ్యక్తితోనే తన భార్య వెళ్లిపోయిందని గురువారం విక్రంగౌడ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, అలీ ఇమ్రాన్‌షేక్‌ తన ఫేస్‌బుక్‌ అకౌంట్‌ను కూడా క్లోజ్‌ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొ న్నాడు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. కాగా.. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.