Asianet News TeluguAsianet News Telugu

అఫైర్: నోట్ల గుడ్డలు కుక్కి, గొంతు నులిమి మహిళ హత్య

నిజాంసాగర్ ఆరేడ్ గ్రామంలో బుధవారం అర్థ రాత్రి దారుణమైన హత్య జరిగింది. 

Married woman killed by in-laws at Nizamasagar

నిజాంసాగర్‌: నిజాంసాగర్ ఆరేడ్ గ్రామంలో బుధవారం అర్థ రాత్రి దారుణమైన హత్య జరిగింది. కోడలిని అత్తింటివారు పైశాచికంగా హత్య చేశారు. కోడలి వివాహేతర సంబంధం వల్ల పరువు పొతుందనే ఉద్దేశంతో వారు ఈ దారుణానికి పాల్పడ్డారు.

ఆరేడ్ గ్రామానికి చెందిన కుర్మ సుమలత (21) అలియాస్‌(రేణుక) అనే వివాహితను నుదిటిపై బాది, నోట్లో గుడ్డలు కుక్కి, కర్రతో వాతలు పెట్టి గొంతు నులిమి చంపేశారు. గ్రామానికి చెందిన కుర్మ మల్లయ్య, సాయవ్వకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు కుర్మబాబుకు మతిస్థిమితం లేదు. 

సంగారెడ్డి జిల్లా సంగారెడ్డిపేట గ్రా మానికి చెందిన రేణుకతో బాబుకు మూడున్నరేళ్ల క్రితం పెళ్లి చేశారు. వారికి ఏడాదిన్నర కుమారుడు గణేశ్‌ ఉన్నాడు.  రేణుక గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. దానిపై అత్తామామలతో రేణుక తరుచూ గొడవ పడేది. దాన్ని మనస్సు లో పెట్టుకున్న అత్తామామలు పథకం ప్రకారం రేణుకను హత్య చేశారు. 

ఇంటి ఆవరణలో నిద్రించిన రేణుకను అర్ధరాత్రి వేళ అత్తామామ గొంతు నులిమి, నోట్లో గుడ్డలు కుక్కి, నుదుటిపై బాదారు. చేతులు, వీపు భాగంలో కర్రతో వాతలు పెట్టారు.  అప్పటికే రేణుక మరణించడంతో బాత్‌రూం వద్ద మృతదేహాన్ని పడుకోబెట్టారు. కరెంట్‌ షాక్‌తో మృతి చెందినట్లు నమ్మించే ప్రయత్నం చేశారు. 
తెల్లవారు జామున గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకోవడంతో అసలు విషయం బయటపడింది. గ్రామస్తుల సమాచారం మేరకు నిజాం సాగర్, పిట్లం మండలాల ఎస్‌ఐలు ఉపేందర్‌రెడ్డి, అంతిరెడ్డితో పాటు బాన్సువాడ రూరల్‌ సీఐ శ్రీనివాస్, డీఎస్పీ నర్సింహారావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. 

మృతదేహానికి పోలీసులు పంచనామా చేసి, పోస్టుమార్టం కోసం బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు అత్త సాయవ్వ, మామ మల్లయ్యపై హత్య కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ఉపందేర్‌రెడ్డి తెలిపారు.

కోడలిని హత్య చేసిన అత్తామామలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మృతురాలి బంధువులు సంఘటన స్థలం వద్ద ఆందోళనకు దిగారు. దీంతో గ్రామస్తులు, నిందితుల బంధువులు కలిసి పంచాయితీ నిర్వహించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios