హైదరాబాద్‌లో ఓ వివాహిత రాత్రిపూట ఇంటిలోనే అందరూ పడుకున్నా సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భర్తకు తెలియకుండా ఆమె బంధువులు, మిత్రుల నుంచి సుమారు రూ. 4 లక్షల వరకు అప్పు చేసింది. ఆ డబ్బులు తిరిగి ఇవ్వాలనే ఒత్తిళ్లు రావడం, ఈ విషయం భర్తకు తెలిస్తే ఏమవుతుందనే భయంతో తీవ్ర నిర్ణయం తీసుకుంది. 

Hyderabad: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో జీడిమెట్లలో ఓ కుటుంబంలో విషాదం అలుముకుంది. ఇద్దరు కొడుకులు, భర్తతో కలిసి జీవిస్తున్న వివాహిత.. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇంట్లో అందరూ పడుకున్నాక ఉరివేసుకుని మరణించింది. ఈ ఘటన జీడిమెట్లలో చింతల్‌లోని చంద్రానగర్ కాలనీలో గురువారం రాత్రి చోటుచేసుకుంది.

చంద్రానగర్ కాలనీలో కే రాజశేఖర్, కే సత్యవాణి (41)లు తమ ఇద్దరు టీనేజీ కొడుకులతో కలిసి జీవిస్తున్నారు. కే రాజశేఖర్ ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగి. 

ఈ కేసుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సత్యవాణి తన మిత్రులు, దగ్గరి బంధువుల నుంచి సుమారు రూ. 4 లక్షలు భర్తకు తెలియకుండా అప్పు తీసుకున్నది. కానీ, ఆమె ఏ ఉద్యోగమూ చేయడం లేదు. హోం మేకర్‌గా ఉండి ఆ డబ్బులు తిరిగి ఇవ్వడం ఎలా అని మదనపడింది. భర్తకు తెలియకుండా ఆమెకు ఎలాంటి ఆర్థిక వనరులు లేవు. డబ్బులు ఇచ్చిన వారు కూడా తమ డబ్బులు తిరిగి ఇచ్చేయాలని ఒత్తిళ్లు పెంచారు.

Also Read: కదులుతున్న ట్రైన్‌లో కాలేజీ విద్యార్థినిపై లైంగిక దాడి.. లేడీస్ కంపార్ట్‌మెంట్‌లోకి వెళ్లి మరీ రేప్

ఈ పరిస్థితులతో ఆమె తీవ్ర ఒత్తిడికి గురైంది. ఒక వేళ తన అప్పుల గురించి భర్తకు తెలిస్తే పరిస్థితి ఏమిటా? అని భయపడింది. అప్పులవారి ఒత్తిళ్లతో ఆమె కలత చెందింది. భర్తకు తెలిస్తే ఏమవుతుందో అనే భయం కూడా వెంటాడింది. దీంతో ఆమె ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయానికి వచ్ిచంది. ఆ రోజు రాత్రి కుటుంబ సభ్యులు అంతా గాఢ నిద్రలోకి వెళ్లిన తర్వాత ఇంటిలోని సీలింగ్ ఫ్యాన్‌కు ఆమె ఉరి వేసుకుని మరణించింది.

జీడిమెట్ల పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు.