వదినతో మరిది అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం ఇరు కుటుంబాలకు తెలిసిపోయింది. వద్దు..మంచిది కాదని వారించారు. దీంతో కొద్ది రోజులు దూరంగా ఉన్నట్లు నటించారు. తర్వాత ఛాన్స్ చూసుకొని లేచిపోయారు. తీరా వారి కోసం వెతకగా... పొలంలో విగతజీవులై కనిపించారు. అయితే... ఇప్పుడు వీళ్లది హత్య, ఆత్మహత్య అన్న విషయం తేలలేదు. ఈ సంఘటన  మెదక్ లోని చేర్యాలలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... చేర్యాల మండలం వీరన్నపేట గ్రామానికి చెందిన పొన్న బోయిన ప్రభాకర్ కి మద్దూరు మండలం కూటిగల్ కు చెందిన అశ్విని(25) తో ఏడేళ్ల క్రితం వివాహమైంది. కాగా... రెండేళ్ల క్రితం అశ్వినికి మరిది వరసయ్యే యువకుడు రామకృష్ణ(21) తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది.

Also Read: దిశను చేసినట్లే చేద్దామని... మృగాడి నుంచి తెలివిగా ఇలా...

ఈ విషయం ఇరు కుటుంబాల్లో తెలియడంతో పెద్దలు మందలించారు. దీంతో... రామకృష్ణ కొంతకాలం పాటు.. హైదరాబాద్ వచ్చి ప్లంబింగ్ పనులు చేసుకుంటున్నాడు. అయితే.... తరచూ జ్వరం వస్తోందంటూ ఇటీవల ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో ఎవరూ చూడకుండా అశ్వినిని తీసుకొని పరారయ్యాడు. తీరా... ఇద్దరి కోసం గాలించగా... పొలంలో విగతజీవులై కనిపించారు.

వారి పక్కనే పరుగుల మందు డబ్బా పడి ఉండటంతో... ఆత్మహత్య చేసుకున్నారని అనుమానించారు. అయితే.. వారి మృతి మిస్టరీగా ఉంది. సాధారణంగా ఆత్మహత్య చేసుకుంటే... పెనుగులాడుకొని చనిపోతారు. వీరి విషయంలో అది కనపడలేదు. వారి కాళ్లకు వేసుకున్న చెప్పులు అలానే ఉన్నాయి. ఇద్దరికీ చేతులకు కత్తి గాట్లు ఉన్నాయి. కాగా... కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. 

Also Read: తను డాక్టర్.. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌తో రెండో పెళ్లి..అంతలోనే...