బిల్డర్ వేధింపులు తాళలేక ఓ గృహిణి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కామారెడ్డికి చెందిన నాగరాజు, అలేఖ్య(32) దంపతులు ఇటీవల కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధి పద్మానగర్ రింగ్ రోడ్డు సమీపంలోని బాగ్ లాల్ రెసిడెన్సీలో ఫ్లాటును కొనుగోలు చేశారు. నాగరాజు ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. కాగా.. అలేఖ్య వస్త్ర వ్యాపారం నిర్వహిస్తోంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

కాగా.. వీరు ఫ్లాట్ కొన్న బిల్డర్ అలేఖ్యను వేధింపులకు గురిచేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అతని వేధింపులు తట్టుకోలేక పోయిన అలేఖ్య ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. 

సంఘటన స్థలానికి చేసుకున్న పేట్‌బషీరాబాద్‌ పోలీసులు మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ‘‘నా చావుకు బిల్డర్‌ సందీప్‌, అనిలా ఆంటీ’’ అని రాసి ఉన్న సూసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.