హైదరాబాద్‌ బోయిన్‌పల్లిలో తల్లితో సహా ఇద్దరు కూతుళ్లు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులను తల్లి విజయలక్ష్మీ, కూతుళ్లు చంద్రకళ, సౌజన్యలుగా గుర్తించారు.

హైదరాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. బోయిన్‌పల్లిలోని ఓ ఇంట్లో కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. తల్లితో సహా ఇద్దరు కూతుళ్లు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇటీవలే తండ్రి చనిపోయాడన్న మనస్తాపంతో వీరు బలవన్మరణానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. మృతులను తల్లి విజయలక్ష్మీ, కూతుళ్లు చంద్రకళ, సౌజన్యలుగా గుర్తించారు. వీరి మరణంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. దనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred