కామన్ గుడ్ ఫండ్ నుంచి  ఈ ఆభరణాలకు  ఖర్చు చేశారనడం ఏమాత్రం సంజాయిషీ కాదు

ముఖ్యమంత్రి కేసీఆర్‌ తిరుపతి వెంకటేశ్వర స్వామికి సొంత మొక్కుబడి తీర్చుకునేందుకు ప్రభుత్వనిధులతో ఆభరణాలు బహూకరించడం చట్టవిరుద్ధమని మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి విమర్శించారు. దీనిమీద తాము కోర్టుకు వెళ్లదలచినట్లు ఆయన వెల్లడించారు.

కామన్ గుడ్ ఫండ్ నిధులను ఈ ఆభరణాలకోసం ఖర్చు చేశారనడం ఏమాత్రం సంజాయిషీ కాదని కూడా ఆయఅన్నారు.

 ‘భారీగా ఆదాయం ఉండే ఆలయాల నుంచి సేకరించే కామన్ గుడ్ ఫండ్ ను శిధిలావస్థలో వున్న ఆలయాలు పునరుద్ధరణకు,. దూపదీప నైవేద్యాలకు నోచుకోని దేవాలయాల కోసం ఉపయోగించాలి. అంతేకాని, ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తిరుమల తిరుపతి దేవస్థానానికి కామన్‌ గుడ్‌ ఫండ్‌ నుంచి ఆభరణాలు చెల్లించడం ఎలా సమర్థనీయం. కామన్ గుడ్ ఫండ్ ఆశయాలకు కూడా అది వ్యతిరేకమే. ఈ విషయంపై హైకోర్టును ఆశ్రయిస్తాం,‘ అని డాక్టర్ రెడ్డి అన్నారు.

ఇందిరాపార్కు సమీపంలో ధర్నాలు జరగకుండా ప్రభుత్వంయోచిస్తూ ఉండటం అప్రజాస్వామికం అని ఆయన్నారు. ‘ ఇందిరా పార్క దగ్గిర నుంచి ధర్నా చౌక్ తరలించాలన్న ఆలోచన మానుకోవాలి. ఇది నిరంకుశ చర్య. ప్రజలు తమ కష్టాలను, సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు, ఈసమస్యలో పరిష్కారంలో జాప్యం జరిగినపుడు నిరసన ప్రభుత్వానికి సూచించారు.

ఇదే సమస్య మీద ఇప్పటికే కొంతమంది మేధావులు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు.