బీజాపూర్- తెలంగాణ సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా హతమైనట్లుగా తెలుస్తోంది

మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా హతమైనట్లుగా వార్తలు వస్తున్నాయి. బీజాపూర్- తెలంగాణ సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హిడ్మా హతమైనట్లుగా తెలుస్తోంది. సీఆర్పీఎఫ్ కోబ్రా, తెలంగాణ గ్రేహౌండ్స్ ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ జరిగింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. హిడ్మాపై రూ.45 లక్షల రివార్డ్ వుంది. 1996-97 మధ్యకాలంలో అతను మావోయిస్ట్ పార్టీలో చేరాడు. ఇతని స్వస్థలం ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లా పూవర్తి. హిడ్మా నేతృత్వంలో గతంలో ఎన్నో మావోయిస్ట్ దాడులు జరిగాయి. ఇతని కోసం తెలంగాణ, ఏపీ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల పోలీసులు తీవ్రంగా గాలిస్తూ వచ్చారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred