జయశంకర్ జిల్లాలో మావోయిస్టు కరపత్రం అమర వీరుల వారోత్సవాలు జరుపుకుందామని ప్రకటన కరపత్రం దొరకడంతో పోలీసుల కలవరం అప్రమత్తమైన జిల్లా పోలీసులు

తెలంగాణలో మళ్లీ మావోయిస్టుల కదలికలు మొదలయ్యాయి. తాజాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మావోయిస్టుల కరపత్రం వెలుగు చూసింది. దీంతో జిల్లాలో చర్చనీయాంశమైంది. ఆ కరపత్రం అక్కడికి ఎలా వచ్చిందన్నదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. జిల్లాలోని వెంకటాపురం మండలం, తిప్పాపురం క్రాస్ రోడ్డు వద్ద ఈ పోస్టర్ లభ్యమైంది.

జులై, ఆగస్టు మాసంలో అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు జరుపుకుందాం అంటూ ఆ కరపత్రంలో ఉంది. ఆ కరపత్రం మీద వర్షపు చినుకులు పడడంతో అక్షరాలు చెదిరిపోయి ఉన్నాయి. ఆ కరపత్రం ఎక్కడ ముద్రించారన్నది పోలీసులు విచారణ జరుపుతున్నారు. కరపత్రం కలకలం రేగడంతో జిల్లా పోలీసులు అలర్టు అయ్యారు. జయశంకర్ జిల్లాకు సరిహద్దు జిల్లాల పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు.