Asianet News TeluguAsianet News Telugu

లొంగిపోయేందుకు సిద్ధమైన మావోయిస్టు అగ్రనేత గణపతి..?

మావోయిస్టు పార్టీ అగ్రనేత గణపతి లొంగిపోతే స్వాగతిస్తామన్నారు తెలంగాణ పోలీసులు. బంధువులు మిత్రుల ద్వారా గణపతి లొంగిపోతాననడం మంచిదనే  వ్యాఖ్యానించారు. 

maoist leader ganapathy ready to surrender police
Author
Hyderabad, First Published Sep 1, 2020, 6:15 PM IST

మావోయిస్టు పార్టీ అగ్రనేత గణపతి లొంగిపోతే స్వాగతిస్తామన్నారు తెలంగాణ పోలీసులు. బంధువులు మిత్రుల ద్వారా గణపతి లొంగిపోతాననడం మంచిదనే  వ్యాఖ్యానించారు. గణపతి ఎవరి ద్వారా లొంగిపోయినా పూర్తిగా సహకరిస్తామని స్పష్టం చేశారు.

జంపన్న, సుధాకర్ లాంటి వారికి ఎలా సహకరించామో గణపతికి అలాగ సహకరిస్తామని చెప్పారు. గణపతికి మానవతా దృక్పథంతో సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.

పునరావాస ప్రక్రియ కింద ఇప్పటికే 1137 మంది లొంగిపోయారని పోలీసులు వెల్లడించారు. గణపతితో పాటు వేణుగోపాల్ కూడా లొంగిపోతున్నట్లు సమాచారం ఉందన్న పోలీసులు.. ఇంకెవరైనా ఉంటే తమను సంప్రదించాలని సూచించారు.

గణపతి వయసు రీత్యా వచ్చే సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లుగా తెలుస్తోంది. మావోయిస్టు పార్టీలో ఆయన అనేక హోదాల్లో పనిచేశారు. అనారోగ్యం నేపథ్యంలో బంధువులు, స్నేహితుల మధ్యవర్తిత్వంతో లొంగిపోయేందుకు సంప్రదింపులు జరుపుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios