భద్రాచలం జిల్లాలో ఉపసర్పంచ్ ను మావోయిస్టులు హత్య చేశారు. పోలీస్ ఇన్ ఫార్మర్ గా వ్యవహరిస్తున్నందునే హత్య చేసినట్టుగా మావోయిస్టులు లేఖను విడుదల చేశారు. 

భద్రాచలం:భద్రాచలం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.కుర్నపల్లి ఉపసర్పంచ్ రాములును మావోయిస్టులు హత్య చేశారు. చర్ల మండలం కుర్నపల్లి ఉపసర్పంచ్ రాములును సోమవారం నాడు రాత్రి మావోయిస్టులు కిడ్నాప్ చేశారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

 కుటుంబ సభ్యులు ప్రాధేయ పడినా కూడా పట్టించుకోలేదు. ఊరికి సమీపంలో రాములును హత్య చేశారు. పోలీస్ ఇన్ ఫార్మర్ గా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ రాములును హత్య చేసినట్టుగా మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. గ్రామ సమీపంలో రాములు మృతదేహన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. రాములు హత్య జరిగిన విషయాన్ని తెలవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.