తెలంగాణలో కాంగ్రెస్ బలోపేతం అవుతుందని.. అది కేసీఆర్‌కు కష్టంగా ఉందని టీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్‌రావ్ ఠాక్రే విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు.
తెలంగాణలో కాంగ్రెస్ బలోపేతం అవుతుందని.. అది కేసీఆర్‌కు కష్టంగా ఉందని టీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్‌రావ్ ఠాక్రే విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందనిమండిపడ్డారు. కాళ్ల కింద భూమి కదులుతుందనే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. రైతులుకు మేలు చేసింది కాంగ్రెస్ పార్టీనేనని అన్నారు. ఉచిత విద్యుత్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రేవంత్ వ్యాఖ్యలపై మాణిక్‌రావ్ ఠాక్రే స్పందించారు.
రేవంత్ రెడ్డి అమెరికాలో మాట్లాడిన మాటలను వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రైతులకు తోడుగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ రైతుల పక్షాన లేదని అబద్దాలు ప్రచారం చేస్తున్నారని.. కాంగ్రెస్ రైతులకు మద్దతుగా ఉందనేది ప్రజలందరికీ తెలుసునని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మరింత వేగంగా పుంజుకుంటుందని అన్నారు.
తెలంగాణ ప్రజలను, రైతులను బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేస్తుందని విమర్శించారు. రాహుల్ గాంధీ వరంగల్‌లో రైతు డిక్లరేషన్ ఇచ్చారని.. ప్రియాంక గాంధీ హైదరాబాద్‌లో యూత్ డిక్లరేషన్ ఇచ్చారని చెప్పారు. ఆ హామీలను అన్నింటిని నెరవేరుస్తామని తెలిపారు. రైతులకు రూ. లక్ష వరకు రుణమాఫీ చేస్తానన్న కేసీఆర్ హామీ ఏమైందని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీపై తెలంగాణ ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తామని చెప్పారు.
బీఆర్ఎస్-బీజేపీలు రెండు ఒక్కటేనని విమర్శించారు. రెండు పార్టీలు కలిసే ఉన్నాయని తాము ముందు నుంచే చెబుతూనే ఉన్నామని అన్నారు. అబద్దాలను ప్రచారం చేస్తూ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ఆయన కుటుంబ ప్రయోజనం కోసం మాత్రమే పనిచేస్తున్నారని ఆరోపించారు. ప్రజల కోసం కేసీఆర్ పనిచేయడం లేదని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతుందని అన్నారు. రేవంత్ రెడ్డి మాట్లాడింది పూర్తిగా వినండి.. అతడు ఏ ఉద్దేశంతో అన్నారో తెలుసుకోండని అన్నారు. సీఎం ఎవరనేది.. ఎమ్మెల్యేలు అందరితో మాట్లాడిన తర్వాత కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయిస్తుందని అన్నారు.
