కాంగ్రెస్ పార్టీలోని అసంతృప్తులను బుజ్జగించేందకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చర్యలు చేపట్టింది. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో వి. హనుమంతరావు, ప్రేమ్ సాగర్ రావుతో బోస్ రాజు చర్చలు జరుపుతున్నారు.

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలోని అసంతృప్తులను బుజ్జగించేందుకు Telangana Congress పార్టీ నాయకత్వం చర్యలు చేపట్టింది. భువనగిరి ఎంపీ Komatireddy Venkat Reddy,మాజీ ఎమ్మెల్సీ prem sagar rao లను బుజ్జగించేందుకు ఆ పార్టీ నేతలు రంగంలోకి దిగారు.

ప్రేమ్‌సాగర్ రావు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఇచ్చిన అల్టిమేటం‌పై ఆ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ ఆరా తీశారు. ఈ విషయమై పార్టీ రాష్ట్ర నాయకులకు ఫోన్ చేసి ఠాగూర్ వివరాలు అడిగి తెలుసుకొన్నారు. ప్రేమ్ సాగర్ రావు తో ఎఐసీసీ కార్యదర్శి Bose Raju చర్చలు జరుపుతున్నారు.మూడు రోజుల్లో తాను లేవనెత్తిన సమస్యలపై కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సరైన సమాధానం చెప్పకపోతే కొత్త పార్టీ పెడతామని ప్రేమ్ సాగర్ రావు హెచ్చరించారు.

also read:టీ.కాంగ్రెస్‌కు మరో షాక్ : పార్టీనీ వీడనున్న ప్రేమ్‌సాగర్ రావు, నవంబర్ 10 వరకు డెడ్‌లైన్.. లేకుంటే..?

మాజీ మంత్రి వినోద్ కు కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘంలో చోటు కల్పించడంపై ఆయన మండిపడ్డారు. ఇంద్రవెల్లిలో తాను రూ. 2 కోట్లు ఖర్చు పెట్టి సభ నిర్వహిస్తే తన పేరును కూడా ప్రస్తావించలేదన్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ ఠాగూర్ పై కూడా ఆయన మండిపడ్డారు. ఆయనో ప్రిన్సిపాల్, తాము ఎల్‌కేజీ పిల్లలమని భావిస్తున్నారని ఆయన మండిపడ్డారు. మాజీ మంత్రులు జీవన్ రెడ్డి లేదా శ్రీధర్ బాబులకు పీసీసీ పదవి ఇవ్వాలనే డిమాండ్ ను పట్టించుకోలేదన్నారు.

ఈ వ్యాఖ్యల గురించి Manickam Tagore తీశారు. వెంటనే ప్రేమ్ సాగర్ తో చర్చించాలని ఠాగూర్ పార్టీ నాయకులను ఆదేశించారు. దీంతో బోస్ రాజు ఆయనతో చర్చలు జరుపుతున్నారు.ఇదిలా ఉంటే భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో మాజీ ఎంపీ వి. హనుమంతరావు శనివారం నాడు చర్చించారు. ఇటీవల జరిగిన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశంలో సీనియర్లు ఈ సమావేశానికి రావడం లేదని వి.హనుమంతరావు గుర్తు చేశారు. కోమటిరెడ్డి బ్రదర్స్ సమావేశానికి రాని విషయాన్ని ప్రస్తావించారు.ఈ విషయమై తాను కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో చర్చిస్తానని హనుమంతరావు చెప్పారు. హనుమంతరావు చేసిన ప్రతిపాదనకు మాణికం ఠాగూర్ ఒకే చెప్పారు.

టీపీసీసీ చీఫ్ రేసులో Revanth Reddy, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు చివరకు వరకు ఉన్నారు. అయితే ఎఐసీసీ నాయకత్వం మాత్రం రేవంత్ రెడ్డికే Pcc చీఫ్ బాధ్యతలు అప్పగించింది. దీంతో తాను గాంధీ భవన్ మెట్టు ఎక్కబోనని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. ఆ తర్వాత గాంధీ భవన్ లో జరిగిన సమావేశాలకు కోమటిరెడ్డి బ్రదర్స్ హాజరు కాలేదు.

హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజున కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఓ ప్రకటనను విడుదల చేశారు. శతృవుకు శతృవు మిత్రుడు కావడంతో ఈటల రాజేందర్ కు సహకరించాల్సి వచ్చిందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు.ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నాయకుడిని వదులుకొనేందుకు సిద్దంగా లేదని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ తెలపారు. వచ్చే ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకొంటున్నామని పార్టీ నేతలు చెప్పారు.