Asianet News TeluguAsianet News Telugu

Minor Gang Rape : నిందితుల అరెస్ట్.. మాయమాటలతో ఆటో డ్రైవర్ దారుణం.. వెలుగులోకి షాకింగ్ విషయాలు... !

సుల్తాన్ బజార్ పోలీసులు,  విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు... అంబర్ పేట కు చెందిన ఆటోడ్రైవర్ కాలేజీ కి వెళ్తున్న  బాలిక (17)కు మాయమాటలు చెప్పి గత నెల 30న మూసీ పరివాహక ప్రాంతానికి తీసుకువెళ్లాడు. అక్కడ గడ్డి ఏపుగా, ఎత్తుగా పెరిగిన స్థలానికి తీసుకెళ్లి rapeకి పాల్పడ్డాడు 

mangalhat minor gang rape incident update
Author
Hyderabad, First Published Dec 9, 2021, 7:33 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

హైదరాబాద్ : Minor Gang Rapeలో Auto driver కిరణ్ (22), సల్మాన్ (23), లింగా చారి (25), షేక్ ఫారుక్ (28), మహమ్మద్ ఇర్ఫాన్ (24) లను పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో నిర్ఘాంతపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. 

సుల్తాన్ బజార్ పోలీసులు,  విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు... అంబర్ పేట కు చెందిన ఆటోడ్రైవర్ కాలేజీ కి వెళ్తున్న  బాలిక (17)కు మాయమాటలు చెప్పి గత నెల 30న మూసీ పరివాహక ప్రాంతానికి తీసుకువెళ్లాడు. అక్కడ గడ్డి ఏపుగా, ఎత్తుగా పెరిగిన స్థలానికి తీసుకెళ్లి rapeకి పాల్పడ్డాడు 

రాత్రంతా అక్కడే ఉండి తెల్లవారుజామున girlను అక్కడే వదిలేసి వచ్చాడు. అయితే ఆ తర్వాత రోజు అంబర్పేట్ పరిసర ప్రాంతాలకు చెందిన మరో ముగ్గురు ఒకరికి తెలియకుండా మరొకరు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. బండ్లగూడకు చెందిన మరో యువకుడు సైతం బాలిక నగర శివారు ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. 

నాలుగు రోజుల అనంతరం Chadar Ghatలో పోలీసుల కంట పడ్డ బాలిక మొదట నోరు విప్పలేదు. రెండు రోజుల తర్వాత జ్వరం రావడంతో భరోసా సెంటర్ కు తరలించారు. అక్కడ తనపై జరిగిన ఘోరాన్ని బయటపెట్టింది. బాలిక చెప్పిన వివరాల మేరకు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులు నేరాన్ని అంగీకరించినట్లు తెలిసింది. దీంతో పోలీసులు నిందితులను రిమాండ్ కు తరలించారు. 

ముషీరాబాద్ వాటర్ ట్యాంక్‌లో డెడ్ బాడీపై వీడిన సస్పెన్స్.. మృతుని వివరాలు గుర్తించిన పోలీసులు

కాగా, మైనర్ బాలిక అదృశ్యం, సామూహిక అత్యాచారం విషయం బుధవారం సంచలనం రేపింది. మైనర్ పై అత్యాచారానికి పాల్పడిన ఐదుగురు యువకులను పోలీసులు నిన్న అరెస్ట్ చేశారు. వీరంతా 20 యేళ్ల లోపు వయసు వారే అని మొదట తెలిసిన సమాచారం.. 17యేళ్ల విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని తెలిసింది. 

నవంబర్ 30న, 17యేళ్ల intermediate student ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఓ అమ్మాయి కనిపించకుండా పోయింది. ఆ రోజు ఉదయం college కని బయలుదేరిన అమ్మాయి.. ఆ తరువాత అదృశ్యం అయ్యింది. రాత్రయినా ఇంటికి రాకపోవడంతో అంతటా వెతికిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు missing case నమోదు చేసుకున్నారు. దర్యాప్తులో భాగంగా డిసెంబర్ 3న సుల్తాన్ బజార్ పోలీసులు చాదర్ ఘాట్ లో ఓ ఆటోడ్రైవర్ తో బాలిక ఉన్నట్లు గుర్తించారు. వెంటనే పోలీసులు girlను స్వాధీనం చేసుకుని ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆ తర్వాత భరోసా సెంటర్‌లో పోలీసులు ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేశారు. 

ఈ వాంగ్మూలంలో ఆమె షాకింగ్ విషయాలు తెలిసింది. మూడు రోజుల వ్యవధిలో ఐదుగురు వ్యక్తులు తన మీద sexual assaultకు పాల్పడ్డారని బాలిక తన వాంగ్మూలంలో పేర్కొంది. ‘మేం ఐదుగురు నిందితులను పట్టుకున్నాం. వీరిలో నలుగురు ఆటో డ్రైవర్లు కాగా, ఒకరు కార్పెంటర్’ అని పోలీసులు తెలిపారు.

బాలిక తెలిపిన వివరాల మేరకు.. కాలేజీకి వెళ్లే సమయంలో బాలికకు నిందితుడితో పరిచయం ఏర్పడింది. అలా వారు ఆమెను ట్రాప్ చేశారు. మూడు రోజుల పాటు, ఒక్కొక్కరు ఒక్కోచోటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెను ఒక్క చోట ఉంచకుండా ఒక్కో సమయంలో ఒక్కో ప్రాంతం తిప్పుతూ ఆచూకీ తెలియకుండా చేశారని.. ఈస్ట్ జోన్ జాయింట్ సీపీ ఎం రమేష్ తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా, IPC, POCSO చట్టం, SC & ST (POA) చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద అత్యాచారం, కిడ్నాప్ కేసు బుక్ చేశామని తెలిపారు. అయితే, బాలిక ప్రియుడితో వెడితే మిగతా వాళ్లు అత్యాచారానికి పాల్పడ్డారని కూడా వార్తలు వచ్చాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios