పవన్ కళ్యాణ్ లాంటి పిచ్చోడిని ఎక్కడా చూడలే

పవన్ కళ్యాణ్ లాంటి పిచ్చోడిని ఎక్కడా చూడలే

తెలంగాణలో పోలీసుల రక్షణలో పర్యటిస్తున్న పవన్ కళ్యాన్ పై ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ ఫైర్ అయ్యారు. ఆయన పర్యటనకు పోలీసు రక్షణ కల్పిస్తున్న తెలంగాణ సిఎం కేసిఆర్ పైనా నిప్పులు చెరిగారు. మంద కృష్ణ సికింద్రాబాద్ లోని సివిల్ కోర్టు కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు చదవండి.

 తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన కోదండ రామ్ లాంటి వాళ్ళు ఇక్కడ పర్యటనలు చేసే స్వేచ్ఛలేదు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఎమ్మార్పీఎస్ దీక్ష చేసే స్వేచ్ఛలేదు. కానీ...పవన్ కళ్యాణ్ తిరిగేందుకు అనుమతిచ్చారు. మమ్మల్ని ఆపేందుకు పోలీసులను పెట్టారు అదే పోలీసులను పవన్ కళ్యాణ్ తిరిగేందుకు పెడుతున్నారు.

తెలంగాణాలో కెసిఆర్ పునాదులు కదులుతున్నాయి. ఆ పునాదులను కాపాడేందుకు పవన్ కళ్యాణ్ ను తిప్పుతుతున్నారు. పవన్ కళ్యాణ్ ను చూసేందుకు అభిమానులు వస్తున్నారు. కానీ ఓటేసేందుకు ఎవ్వరూ రారు. ఇక్కడ కెసిఆర్ పాలన ఏపీలో చంద్రబాబు పాలన పవన్ కళ్యాణ్ బాగుందంటున్నారు. అంతా బాగుంటే పవన్ కళ్యాణ్ ఎందుకు తిరుగుతున్నారు.

నా జీవితంలో ఇప్పటి వరకు చాలామంది పిచ్చోళ్ళను చూశాను కాని పవన్ కళ్యాణ్ లాంటి పిచ్చోన్ని ఎక్కడా చూడలేదు. సీఎం కెసిఆర్ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ ల పై గతంలో నాన్ బెయిలబుల్ కేసులు నమోదు అయ్యాయి. ఆ కేసులు తిరగదోడి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గవర్నర్ నరసింహన్ ను కలుస్తాను.

గవర్నర్ చట్టం అందరికి సమానంగా పనిచేసే విధంగా చూడాలి. చట్టం ఒకరికి చుట్టంగా...మరోకరిని అణచివేసే విధంగా ఉండకూడదు. నా పై నాన్ బెయిలబుల్ కేసు లేకున్నా నన్ను జైల్లో ఎందుకు పెట్టారు? ఈవిషయంలో గవర్నర్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలి.

కెసిఆర్ గతంలో పది రోజులు దీక్ష చేసినప్పుడు ఎందుకు పట్టించుకోలేదు. ఎందుకు కేసులు పెట్టలేదు. నేను 48 గంటలు దీక్ష అని...48 సెకన్లు కూడా చేయకుండానే ఎందుకు అరెస్ట్ చేశారు? మిలియన్ మార్చ్  ఘటన లో అత్యంత విధ్వంసం జరిగింది. అందుకు కారణమైన వారిని ఆ ఘటనలో అప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేదు?

ప్రజా ఉద్యమం అణచివేయలని సీఎం కెసిఆర్ చూస్తున్నారు. అధికారంలో ఉన్నవాళ్ళకు పోలీస్ వ్యవస్థ కక్ష తీర్చుకునే యంత్రాంగం గా మారోద్దు. గవర్నర్ ను కలిసేందుకు ఈరోజు అపోయాయింట్ కోరుతాం. దొరలకు ఒకన్యాయం....దళితులకు ఒక న్యాయమా....? అని అడుగుతాం.

ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ఎస్సి వర్గీకరణ పై బిల్లు తేవాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తాం. సీఎం కెసిఆర్ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. ఈ అంశం పై ఒత్తిడితెస్తాం. 27 లోపు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటుచేసి అన్ని రాజకీయపార్టీలను భాగస్వామ్యం చేసి మా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Telangana

Next page