మంచిర్యాల : 
మంచిర్యాల జిల్లా కలమడుగు నుండి జగిత్యాలకు పెళ్లి బృందం వెళ్తున్నది. స్థానిక ఫారెస్ట్ చెక్ పోస్ట్ దగ్గర పెళ్ళి బస్ బృందాన్ని ఫారెస్టు పోలీసు అధికారి ఆపారు. లంచం ఇస్తేనే ఇక్కడినుంచి కదలనిస్తానని ఆపేశాడు. అంతేకాదు. పదో పర్కో ఇస్తే ఒప్పుకునే సవాలే లేదని పెళ్లి బృందాన్ని భయబ్రాంతులకు గురిచేశాడు.

పెళ్లికి పోతున్నాం కాబట్టి ఆపినందుకైనా 200 ఇద్దామని పెళ్లి వాళ్లు అనుకున్నారు. 200 రూపాయలు తీసుకో అని ఫారెస్ట్ ఆఫీసర్ ను రిక్వెస్ట్ చేశారు. అయితే ఆ ఆఫీసర్ అసలే వినలేదు. వెయ్యి రూపాయలు ఇస్తేనే బస్సును కదలనిస్తానని బెదిరించాడు. భయపెట్టాడు. ఈ తతంగాన్ని అంతా బాధితుడు ఒకరు సెల్ ఫోన్ కెమెరాలో రికార్డు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు.

ఫారెస్టు అధికారి పెళ్లి బృందాన్ని డబ్బులు అడగడం ఏందని పెళ్లి వారు అడిగితే వాళ్ల మీద ఈ ఫారెస్టు పోలీసు ఎలా చిందులేసిండో పైన వీడియోలో ఉంది చూడండి. ఆ ఫారెస్టు ఆఫీసర్ పేరు నయీమ్ ఉద్దీన్ అని సోషల్ మీడియాలో ప్రచారం తీవ్రమైంది.