మంచిర్యాల (mancherial) జిల్లాలోని కన్నెపల్లి తహశీల్దార్ కార్యాలయంలో ఓ వీఆర్‌ఏ దారుణ హత్యకు గురయ్యాడు. వీఆర్‌ఏ రక్తపుమడుగులో పడి ఉండటం గుర్తించిన స్థానికులు పోలీసులుకు సమాచారం అందించారు. 

మంచిర్యాల జిల్లాలో దారుణం చోటుచేసకుంది. జిల్లాలోని కన్నెపల్లి తహశీల్దార్ కార్యాలయంలో ఓ వీఆర్‌ఏ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ రోజు ఉదయం తహశీల్దార్ కార్యాలయంలో వీఆర్‌ఏ రక్తపుమడుగుడులో పడి ఉండటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వివరాలు.. దుర్గం బాబు అనే వ్యక్తి కొత్తపల్లి వీఆర్‌ఏగా పనిచేస్తున్నాడు. అయితే సోమవారం ఉదయం కన్నెపల్లి తహశీల్దార్ కార్యాలయంలో రక్తపుమడుగులో పడి ఉన్న దర్గం బాబును గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

దీంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు ఆరా తీశారు. పరిసరాలను పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దుర్గం బాబు హత్యకు గురయ్యాడనే విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.