చిత్తూరులో ఘోర ప్రమాదం: డివైడర్ ను ఢీకొన్న కారు, ఆరుగురు మృతి
చిత్తూరు జిల్లాలో ఆదివారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో 3ఆరుగరు మరణించారు. పలువురు గాయపడ్డారు. చంద్రగిరి మండలం ఐతేపల్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది.
తిరుపతి: చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఐతేపల్లి వద్ద ఆదివారం నాడు ఘోర Road Accident ప్రమాదం చోటు చేసుకొంది.ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అతి వేగంగా వెళ్తున్న కారు డివైడర్ ను ఢీకొట్టడంతో ఆరుగురు మరణించారు. సంఘటన స్థలంలో ఆరుగురు మరణించగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు చనిపోయారు. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అతివేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు దగ్దమైంది.. ఈ ఘటనలో ఆరుగురు మరణించగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. మృతుల్లో ఏడాదిన్నర చిన్నారి కూడా ఉంది. క్షతగాత్రులను రుయా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఎనిమిది మంది ఉన్నారు. సంఘటన స్థలంలోనే ఐదుగురు మరణించారు. కారులోనే ఉన్న ముగ్గురిని స్థానికులు బయటకు తీసి అంబులెన్స్ లో రుయా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన కారును ఏపీ 39 హెచ్ఏ 4003 గా గుర్తించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒకరు మరణించారని పోలీసులు తెలిపారు.
also read:జగిత్యాల జిల్లాలో రోడ్డుప్రమాదం... ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు మృతి
ప్రమాదంలో మరణించిన వారంతా ఒకే కుటుంబానికి చెందిన శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన వారుగా పోలీసులు అనుమానిస్తున్నారు. మూడు రోజుల క్రితం తిరుపతిలో వెంకన్న దర్శనం చేసుకొన్నారు. స్వామిని దర్శించుకొన్న తర్వాత శ్రీకాళహస్తికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకొంది. ఈ ప్రమాదానికి కొద్దిసేపటికి ముందే వీరంతా కాణిపాకం వినాయకస్వామిని దర్శించుకొన్నారు. వాహనం అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రమాదం జరిగిన స్థలానికి కొన్ని మీటర్ల దూరంలోనే కారు కుడి వైపునకు తిరగాల్సి ఉంది. అయితే అతి వేగంతో పాటు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకొందని పోలీసులు చెబుతున్నారు.ఇదే హైవే మూడు ప్రమాదాలు చోటు చేసుకొన్నాయి. ఈ మలుపు ప్రమాదాలకు కారణమౌతున్నాయని స్థానికులు చెబుతున్నారు.