హైదరాబాద్: హైద్రాబాద్ నగరంలోని అస్మత్‌పేట చెరువులో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. ఆయనను కాపాడేందుకు స్థానికులు ప్రయత్నించారు. కానీ ఫలితం లేకుండాపోయింది. గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

అస్మత్ పేట లేక్ వరద నీటిలో ఓ వ్యక్తి కొట్టుకుపోతున్నాడు. అయితే నీటి మధ్యలో దొరికిన వస్తువును ఆసరాగా చేసుకొని పట్టుకొన్నాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానిక యువకులు అతడిని రక్షించేందుకు ఓ కర్రను  అతడికి అందించేందుకు ప్రయత్నించారు.

అయితే  ఆ కర్ర అందుకొనేందుకు ఆ వ్యక్తి ప్రయత్నించాడు. వరద ఉధృతి ఎక్కువ కావడంతో ఆ వ్యక్తి కొట్టుకుపోయాడు. వరద నీటిలో గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

also read:హుస్సేన్‌సాగర్‌కు పోటెత్తిన వరద: లెవల్‌ను దాటి చేరిన నీరు

హైద్రాబాద్ శివారులో 32 సెం.మీ వర్షపాతం నమోదైంది. నగరంలోని పలు చోట్ల 24 సెం.మీ. పైగా వర్షపాతం నమోదైంది. ఈ వర్షానికి పాతబస్తీలో ఓ వ్యక్తి కొట్టుకుపోయాడు.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

తాజాగా అస్మత్ పేట లేక్ లో మరో వ్యక్తి గల్లంతయ్యాడు. నగరంలోని పలు కానీల్లో భారీగా వరద నీరు చేరింది. పలు కాలనీల్లో విద్యుత్ నిలిచిపోయింది.