హైదరాబాద్: హుస్సేన్ సాగర్ పూర్తిస్థాయిలో నిండిపోయింది. భారీ వర్షాల కారణంగా హుస్సేన్ సాగర్ కు వరద పోటెత్తింది.హుస్సేన్ సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 513.41 మీటర్లు. ప్రస్తుతం హుస్సేన్ సాగర్ కు పూర్తిస్థాయి నీటి మట్టాన్ని దాటింది.

పూర్తి స్థాయి నీటి మట్టాన్ని దాటి వరద చేరింది. ప్రస్తుతం 513.70 మీటర్ల మేరకు వరద నీరు చేరింది.ఇవాళ ఉదయం నుండి నాలుగు గేట్లను ఎత్తి నీటిని దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అయినా కూడ నీటి ఉధృతి తగ్గలేదు.

also read:సెల్లార్‌లోకి వరద నీరు: నీటిలో పడి బాలుడి మృతి

ఇవాళ ఉదయం జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ హుస్సేన్ సాగర్ పరిశీలించారు.హుస్సేన్ సాగర్ ప్రభావిత ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. 

ఈ ఏడాది ఆగష్టు మాసంలో కూడ భారీ వర్షాలకు హుస్సేన్ సాగర్ కు భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఆ సమయంలో కూడ హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.