Telangana : ఇదేం విడ్డూరం... కరెంట్ బిల్లు కట్టమంటే కర్రలతో వెంటపడ్డారా..!

కరెంట్ బిల్లు కట్టలేదని విద్యుత్ సరఫరా నిలిపివేసేందుకు వెళ్ళిన సిబ్బందిపై దాడికి యత్నించాడు ఆ ఇంటి యజమాని. ఈ ఘటన నిర్మల్ జిల్లా భైంసాలో వెలుగుచూసింది. 

Man Threaten to Electricity staff in Bhainsa AKP

బైంసా : అతడు గత ఏడాదికాలంగా ఇంటి కరెంట్ బిల్లు కట్టలేదు. దీంతో ఏకంగా రూ.20వేలకు పైగా బిల్లు పెండింగ్ లో వుంది. ఇక అతడు కరెంట్ బిల్లు కట్టేలా కనిపించకపోవడంతో ఆ ఇంటికి విద్యుత్ సరఫరా నిలిపివేసేందుకు అధికారులు సిద్దమయ్యారు. దీంతో విద్యుత్ అధికారులు ఇంటికి వెళ్ళగా అతడు ఆగ్రహంతో ఊగిపోతూ దాడికి యత్నించాడు.ఈ ఘటన  నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో చోటుచేసుకుంది. 

విద్యుత్ అధికారులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. భైంసా పట్టణంలో మోహిన్ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. గత ఏడాదిగా వీరు నివాసముండే ఇంటి కరెంట్ బిల్లు కట్టడంలేదు. రూ.20 వేలకు పైగా బిల్లు పెండింగ్ లో వుండటంతో ఆ ఇంటికి విద్యుత్ సరఫరా నిలిపివేయడానికి వెళ్ళినట్లు సిబ్బంది తెలిపారు.ఈ క్రమంలోనే ఇంటి యజమాని మోమిన్ తమను దుర్బాషలాడుతూ దాడికి యత్నించాడాని తెలిపారు. కర్రతో కొట్టడానికి ప్రయత్నించగా ఎలాగోలా తప్పించుకున్నట్లు విద్యుత్ ఉద్యోగి సుధాకర్ తెలిపాడు.

 

Also Read  కేసీఆర్ పేరును తొలగించి తన పేరు ... అధికారులపై సీఎం రేవంత్ సీరియస్

మోమిన్ దాడి నుండి తప్పించుకున్న విద్యుత్ ఉద్యోగులు ఉన్నతాధికారుల సూచన మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసుకున్న భైంసా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios