ప్రియురాలు పెళ్లికి ఒప్పుకోలేదని ఆత్మహత్యకు ప్రయత్నించాడో యువకుడు. సూర్యాపేట జిల్లా పిల్లలమర్రి గ్రామానికి చెందిన రామన్.. మునగాల మండలానికి చెందిన యువతిని పదేళ్లుగా ప్రేమిస్తున్నాడు.

సదరు యువతి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో పనిచేస్తోంది. అయితే ఉద్యోగం వచ్చిన తర్వాత తనను పట్టించుకోవడం లేదని రామన్ మనస్తాపానికి గురయ్యాడు.

తన ప్రేమకు గుర్తుగా ఓ పుస్తకాన్ని రాసి తన స్నేహితులకు పంచిపెట్టాడు. కాల్ రికార్డింగ్‌లు స్నేహితులకు షేర్ చేశాడు. దాంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ నేపథ్యంలో ఆ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రస్తుతం అతని పరిస్ధితి విషమంగా వుండటంతో ప్రభుత్వాసుపత్రికి తరలించారు.