తన ఇంటికి రావాలని శబజ్ భార్యతో గొడవపడ్డాడు. అయినప్పటీకి ఆమె రాకపోవడంతో బ్లేడ్‌తో గొంతు కోసుకున్నాడు. ప్రస్తుతం ఉస్మానియా ఆస్పత్రిలో అతనికి వైద్య చికిత్స అందిస్తున్నారు.
భార్య పుట్టింటి నుంచి రావడం లేదనే ఆవేదనతో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ పాతబస్తీ భవాని నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంతోష్ నగర్‌కి చెందిన మొహమ్మద్ శబజ్ వృత్తి ఆటో డ్రైవర్.
Add Asianetnews Telugu as a Preferred Source

భవాని నగర్‌కి చెందిన బేగంతో సంవత్సరం క్రితం వివాహం జరిగింది. శబజ్ ఇది రెండవ పెళ్లి. నిత్యం మద్యం, వైట్నర్ సేవించి భార్యని కొట్టడం చిత్రహింసలకు గురిచేసేవాడు. భర్త వేధింపులు కట్టుకోలేక మహిళ పోలీస్ స్టేషన్‌లో భార్య ఫిర్యాదు చేసింది.
అనంతరం పుట్టింటిలోనే ఉంటోంది. ఈ క్రమంలోనే శనివారం ఉదయం తన ఇంటికి రావాలని శబజ్ భార్యతో గొడవపడ్డాడు. అయినప్పటీకి ఆమె రాకపోవడంతో బ్లేడ్‌తో గొంతు కోసుకున్నాడు. ప్రస్తుతం ఉస్మానియా ఆస్పత్రిలో అతనికి వైద్య చికిత్స అందిస్తున్నారు.
