మైనర్ బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడిన ఓ వ్యక్తికి ఖమ్మం కోర్టు 20యేళ్ల జైలుశిక్షను విధించింది. ఇంటిముందు ఆడుకుంటున్న బాలికకు పుట్నాలు పెడతానని చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి ఒడిగట్టబోయాడు. 

ఖమ్మం : కామంతో కళ్లు మూసుకుపోయిన నిందితులు చిన్నారులను కూడా వదలడం లేదు. వారికి చాక్లెట్లో, తినే వస్తువులో ఆశచూపి అత్యాచారాలకు పాల్పడుతున్నారు. అలా ఓ బాలికకు పుట్నాలు ఆశచూపి అత్యాచారయత్నం చేయబోయాడో నిందితుడు. ఓ బాలికపై rape attempt చేసిన నిందితుడికి 20 ఏళ్ల imprisonment విధిస్తూ khammam సెకండ్ ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ సెషన్స్ కోర్టు (పోస్కో-2) న్యాయమూర్తి మహమ్మద్ అఫ్రోజ్ అక్తర్ బుధవారం తీర్పు చెప్పారు. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం పెద్ద బీరవల్లి గ్రామానికి చెందిన ఫిర్యాదికి ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నారు. వారిద్దరూ మైనర్లు. కాగా ఆమె రోజు కూలీ పనులకు పోతూ ఉండేది. ఈ క్రమంలోనే 2020 జూలై 25న తన పిల్లలను ఇంటి వద్ద ఉంచి రోజూ లాగే కూలిపనులకు వెళ్లింది. ఈ నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన బొల్లె పోగు వెంకటేశ్వర్లు ఇంటి ఎదుట ఆడుకుంటున్న బాలికకు పుట్నాలు పెడతానని చెప్పి తన ఇంటికి తీసుకువెళ్లి తలుపులు వేసి బాలికపై అత్యాచారయత్నం చేయబోయాడు.

దీనిని గమనించిన చుట్టుపక్కల వారు నిందితుడి ఇంటికి వెళ్లి.. కేకలు వేసి అతనిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు.. అని బాలిక తల్లి అప్పట్లో బోనకల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దానిపై కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయగా ఆ కేసును విచారించిన న్యాయమూర్తి నిందితుడిపై నేరం రుజువు కావడంతో అతడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరఫున స్పెషల్ పిపి టి.హైమావతి వాదించగా, లైజన్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు, కోర్టు కానిస్టేబుల్ బి. అరవింద్, హోంగార్డు యు. చిట్టి బాబు సహకరించారు.

ఇదిలా ఉండగా, మార్చి 31న విశాఖపట్నంలో ఇలాంటి కేసులో ఓ వ్యక్తికి పదేళ్ల జైలుశిక్ష పడింది. బాలికపై Molestation జరిపిన కేసులో నిందితుడికి పదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు వెయ్యి రూపాయల fine కూడా చెల్లించాలని court ప్రత్యేక న్యాయమూర్తి శ్రీనివాసరావు తీర్పునిచ్చారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో రెండు నెలల జైలు శిక్ష అనుభవించాలి అని న్యాయమూర్తి ఆదేశించారు. ఫోక్సో న్యాయస్థానం ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ కరణం కృష్ణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బాజీ జంక్షన్, కూరగాయల మార్కెట్ ప్రాంతానికి చెందిన చాపల శ్రీనివాసరావు (32) రాడ్ బెండర్ గా పని చేసేవాడు. బుచ్చి రాజుపాలెం, పైడితల్లమ్మ ఆలయం ప్రాంతానికి చెందిన బాలిక (6) 2016 జూలై 19న పైడితల్లమ్మ ఆలయం వద్ద ఒంటరిగా ఆడుకుంటుంది.

 శ్రీనివాసరావు బాలిక నోరు మూసి ఆలయం వెనుక భాగంలో ఉన్న పాడు పడిన ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు ప్రాసిక్యూషన్ ఆరోపించింది. బాధితురాలు తనపై జరిగిన అఘాయిత్యాన్ని తన తండ్రికి సంజ్ఞలతో తెలిపింది. తండ్రి ఫిర్యాదు మేరకు ఎయిర్పోర్ట్ పోలీసులు కేసు నమోదుచేసి నిందితుడు శ్రీనివాసరావు న్యాయస్థానంలో హాజరుపరిచారు. పరిశీలించిన న్యాయమూర్తి పైవిధంగా శిక్ష విధించారు.